Pixel 8 series | 50ఎంపీ మెయిన్ కెమెరాతో రానున్న పిక్సెల్ 8 సిరీస్
గూగుల్ పిక్సెల్ 8 (Pixel 8 series) సిరీస్ అక్టోబర్‌లో లాంఛ్ కానుండగా, అధికారిక లాంఛ్‌కు ముందే ఈ హాట్ డివైజ్ కెమెరా వివరాలు లీకయ్యాయి. పి
న్యూఢిల్లీ : గూగుల్ పిక్సెల్ 8 (Pixel 8 series) సిరీస్ అక్టోబర్‌లో లాంఛ్ కానుండగా, అధికారిక లాంఛ్‌కు ముందే ఈ హాట్ డివైజ్ కెమెరా వివరాలు లీకయ్యాయి. పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రొతో న్యూ పిక్సెల్ 8 ఫ్యామిలీ న్యూ టెన్సర్ జీ3 ఎస్ఓసీతో రానుందనే వార్తలు రాగా, తాజాగా కెమెరా ఫీచర్లు కూడా లీకయ్యాయి. పిక్సెల్ 8 వెనుక భాగంలో రెండు కెమెరాలు ఉంటాయని, పిక్సెల్ 8 ప్రొ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుందని చెబుతున్నారు.
న్యూ హార్డ్‌వేర్, గూగుల్ బ్రిలియంట్ ఇమేజ్-ప్రాసెసింగ్ టెక్నాలజీతో ఫొటోగ్రఫీలో లేటెస్ట్ అప్‌గ్రేడ్‌తో పిక్సెల్ 8 సిరీస్ కస్టమర్ల ముందుకు రానుంది. పిక్సెల్ 8 సిరీస్‌లో అప్‌గ్రేడెడ్ 50 ఎంపీ శాంసంగ్ జీఎన్2 ఐసోసెల్ వైడ్ కెమెరా ఉంటుందని అండ్రాయిడ్ అథారిటీ పేర్కొంది. జీఎన్2 ప్రాసెసర్ 35 శాతం అధిక లైటింగ్‌తో క్యాప్చర్ చేస్తుందని చెబుతున్నారు.
తక్కువ లైటింగ్ ఉన్న సెట్టింగ్స్‌లోనూ మెరుగైన ఫొటోలను ఇది రాబడుతుంది. అల్ట్రా వైడ్ ఫొటోల కోసం ఈ ఫోన్లో సోనీ ఐఎంఎక్స్787 సెన్సర్ ఉంటుంది. ఇక వనిల్లా పిక్సెల్ 8 సోనీ ఐఎంఎక్స్386 సెన్సర్‌తో 12 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరాను కంటిన్యూ చేస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పిక్సెల్ 8 ప్రొలో మూడో కెమెరా సెన్సర్ గత ఏడాది తరహాలోనే 48 ఎంపీ శాంసంగ్ జీఎం5 కెమెరాగా కొనసాగుతుంది. ఇది 5x జూమ్‌ను ఆపర్ చేస్తుంది. ఇక పిక్సెల్ 8 సిరీస్‌లో సెల్పీ కెమెరా గత ఏడాది మాదిరే 11 ఎంపీ శాంసంగ్ జీఎం5 కెమెరాతో కస్టమర్ల ముందుకు రానుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read More
Sunglasses | ఈ సన్‌గ్లాసెస్‌తో ఫొటోలు తీయొచ్చు.. పాటలు వినొచ్చు.. ఫోన్లు మాట్లాడొచ్చు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

