హైదరాబాద్ : అఫీషియల్ లాంచ్ కంటే ముందే అమెజాన్ వెబ్ సైట్ లోనూ వన్ ప్లస్ ఆన్ లైన్ స్టార్ లోనూ వన్ ప్లస్ నార్డ్ సీఈ -2 స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానున్నది. భారతదేశంలో ఫిబ్రవరి 17న వన్ ప్లస్ నార్డ్ సీఈ -2 ఆన్లైన్ లాంచ్ ఈవెంట్ ద్వారా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి అమెజాన్ ఇండియా వెబ్సైట్లో కూడా “వన్ ప్లస్ నార్డ్ సీఈ -2 కమింగ్ ఫిబ్రవరి 17” అని డిస్ప్లే యాడ్ కనిపిస్తోంది.
OnePlus Nord CE 2ప్రత్యేకత ఏమిటంటే 65W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇ-కామర్స్ జాబితా రాబోయే OnePlus స్మార్ట్‌ఫోన్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నదనే వివరాలను కూడా నిర్ధారిస్తుంది. OnePlus Nord CE-2 అమెజాన్ ఇండియా వెబ్సైట్, OnePlus ఆన్లైన్ స్టోర్లలో విడుదలైన తర్వాతనే ఇతర రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అయితే ఆఫ్ లైన్ విక్రయాలకు సంబంధించిన తేదీపై ఇంకా క్లారిటీ రాలేదు.
స్పెసిఫికేషన్స్…
స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్, HRD10+ సపోర్ట్ తో 6.43- అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, పైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ను కలిగి ఉంటుంది. అంతేకాదు OnePlus Nord CE 2 మెమరీ 8GB RAM , 128GB ఇంటర్నల్ మెమరీతో పాటు ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 900 5G ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకునే వీలుఉంటుంది.
ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్, ఇందులో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ , 2-మెగాపిక్సెల్ ఇమేజ్ సెన్సార్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ రెండు కాన్ఫిగరేషన్లలో వస్తుంది. 6GB RAM + 128GB మెమరీ, 8GB RAM + 128GB మెమరీతో అందుబాటులోకి రానున్నది.