Oneplus N6 | రూ.20వేల లోపే వన్‌ప్లస్ నుంచి కొత్త సిరీస్ మొబైల్స్.. లాంచ్ ఎప్పుడంటే.!
Oneplus N6 | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ భారత మార్కెట్లోకి సరికొత్త ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను తీసుకురానుంది. వన్‌ప్లస్ N పేరుతో కొత్త సిరీస్‌ను ప్రకటించగా.. అందులో తొలి మోడల్‌గా Oneplus N6 మొబైల్‌ను ఈ నెలాఖారులో విడుదల చేయనుంది.
Oneplus N6 | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ భారత మార్కెట్లోకి సరికొత్త ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను తీసుకురానుంది. వన్‌ప్లస్ N పేరుతో కొత్త సిరీస్‌ను ప్రకటించగా.. అందులో తొలి మోడల్‌గా Oneplus N6 మొబైల్‌ను ఈ నెలాఖారులో విడుదల చేయనుంది. ఈ మేరకు ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ డేట్, ధర, ఫీచర్ల వివరాలను వెల్లడించింది.
వన్‌ప్లస్ N6 స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో ఆవిష్కరించనున్నట్లు వన్‌ప్లస్ కంపెనీ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌కు తక్కువ ధరలో ప్రత్యామ్నాయంగా ఈ కొత్త N సిరీస్‌ను తీసుకొస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో మధ్యతరగతి వినియోగదారుల లక్ష్యంగా చవకైన ఫోన్‌గా ఇది రానున్నట్లు టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
కంపెనీ విడుదల చేసిన టీజర్ ప్రకారం.. వన్‌ప్లస్ N6 ఫోన్ ఫ్లాట్ డిజైన్‌తో రానుంది. వెనుక భాగంలో ఎడమవైపు పై మూలలో చతురస్రాకార కెమెరా మాడ్యుల్ ఉండగా.. అందులో రెండు కెమెరా సెన్సర్లు, LED ఫ్లాష్ ఏర్పాటు చేశారు. మధ్యభాగంలో వన్‌ప్లస్ లోగో కనిపించనుంది. ఈ మొబైల్‌కు ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ కూడా అందించారు.
ఫోన్ కుడివైపు పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ ఉండగా.. ఎడమవైపు ఎలాంటి బటన్లు లేకుండా ఈ మొబైల్‌ను డిజైన్ చేశారు. దిగువ భాగంలో USB Type C పోర్టు, స్పీకర్ గ్రిల్, సిమ్ ట్రే, ఇవ్వనున్నారు. పైభాగంలో సెకండరీ మైక్రోఫోన్ కట్అవుట్ కూడా ఉండనుంది.
ముందు భాగంలో ఫ్లాట్ డిస్ప్లే అందించగా.. మధ్యలో హోల్ పంచ్ కట్ అవుట్ ద్వారా సెల్ఫీ కెమెరా ఏర్పాటు చేశారు. అయితే ఫోన్ చుట్టూ బెజెల్స్ కొంత మందంగా కనిపిస్తున్నాయి. డిజైన్పరంగా చూస్తే ఇది ఇటీవల విడుదల చేసిన Nord CE సిరీస్‌ను గుర్తుచేసేలా ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ధర విషయానికి వస్తే వన్‌ప్లస్ N సిరీస్ స్మార్ట్ఫోన్లు రూ.18వేల నుంచి రూ.25వేల మధ్య ధరల్లో అందుబాటులోకి వస్తాయని Oneplus కంపెనీ వెల్లడించింది. దీంతో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ ఫోన్ల కంటే ఇవే మరింత చవకగా ఉండనున్నాయి. కోర్ వన్‌ప్లస్ అనుభవాన్ని మరింత విస్తృతమైన వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా ఈ సిరీస్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మొబైల్ ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ ద్వారా విక్రయానికి అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్ రంగుల్లో లభించనుంది. జూలైలో ఈ మొబైల్ విడుదలవుతుందని మొదట్లో ప్రచారం జరిగినప్పటికీ.. చివరకు జూన్ 30వ తేదీన ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయాలని నిర్ణయించింది. ఈ మొబైల్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, కెమెరా ఫీచర్లు, ప్రాసెసర్ వంటి వివరాలు మొత్తం లాంచింగ్ ఈవెంట్లోనే వెల్లడికానున్నాయి.
Read More:
Realme Narzo Days Sale | రూ.28వేల స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.15 వేలకే.. బంపరాఫర్ ప్రకటించిన రియల్మీ
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

