OnePlus | ఆగస్ట్ 29న తొలి ఫోల్డింగ్ ఫోన్ లాంఛ్ చేయనున్న వన్‌ప్లస్
న్‌ప్లస్ (OnePlus) ఆగస్ట్ 29న తన తొలి ఫోల్డింగ్ ఫోన్‌ను లాంఛ్ చేయనుంది. ఈ డివైజ్ పేరు గతంలో వన్‌ప్లస్ వీ ఫోల్డ్ అని ప్రచారంలో ఉండగా కంపెనీ ఫోల్డింగ్ ఫోన్‌ను వన్‌ప్లస్ వన్‌గా నిర్ధారించిందని సమాచారం.
న్యూఢిల్లీ : వన్‌ప్లస్ (OnePlus) ఆగస్ట్ 29న తన తొలి ఫోల్డింగ్ ఫోన్‌ను లాంఛ్ చేయనుంది. ఈ డివైజ్ పేరు గతంలో వన్‌ప్లస్ వీ ఫోల్డ్ అని ప్రచారంలో ఉండగా కంపెనీ ఫోల్డింగ్ ఫోన్‌ను వన్‌ప్లస్ వన్‌గా నిర్ధారించిందని సమాచారం. శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5 లాంఛ్ అయిన నెలరోజుల అనంతరం ఆగస్ట్ 29న వన్‌ప్లస్ ఫోల్డింగ్ ఫోన్ లాంఛ్ అవుతుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారని స్మార్ట్‌ప్రిక్స్ పేర్కొంది.
లీక్డ్ డిజైన్ అంటూ ఇప్పటికే స్మార్ట్‌ప్రిక్స్ మ్యాగజైన్ వన్‌ప్లస్ వన్ వివరాలను బయటపెట్టింది. వన్‌ప్లస్ ఫోల్డింగ్ ఫోన్ నోట్‌బుక్ తరహా ఫ్యాక్టర్‌తో గెలాక్సీ జడ్ ఫోల్డ్ 4, గూగుల్ పిక్సెల్ ఫోల్డ్‌ను పోలిఉంటుంది. ఫ్లిప్ ఫోల్డింగ్ ఫోన్‌ను వన్‌ప్లస్ లాంఛ్ చేస్తుందా లేదా అనే వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక వన్‌ప్లస్ అనుబంధ కంపెనీ ఒప్పో ఇప్పటికే ఒప్పో ఫైండ్ ఎన్2ఫ్లిప్‌ను లాంఛ్ చేసింది.
వన్‌ప్లస్ ఫోల్డింగ్ ఫోన్ లెదర్ బ్యాక్‌తో పాటు భారీ ఎక్ట్ర్సనల్ డిస్ప్లేతో కస్టమర్ల ముందుకు రానుందని టెక్ నిపుణుల అంచనా. వన్‌ప్లస్ 11 తరహాలో కెమెరా రౌండ్ మాడ్యూల్తో రానుంది. మొబైల్ వెనుక ఎడమ వైపున ఎల్ఈడీ లైట్ ఆకర్షణగా నిలుస్తుంది. కెమెరా మాడ్యూల్ దిగువన వన్‌ప్లస్ లోగోను డిజైన్ చేశారు. ఇక వన్‌ప్లస్ వన్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 2 ఎస్ఓసీ ప్రాసెసర్, 2కే అమోల్డ్ (ఎల్టీపీఓ) డిస్ప్లేతో 100డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో 4800ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది. వన్‌ప్లస్ తొలి ఫోల్డింగ్ ఫోన్ వన్‌ప్లస్ వన్ లేదా వన్‌ప్లస్ వీ ఫోల్డ్ ధర రూ. లక్ష పైనే ఉంటుందని అంచనా.
Read More :
Google Pay UPI Lite | గూగుల్ పే యూజర్లకు గుడ్‌న్యూస్..! ఇక సింగిల్ క్లిక్‌తో పేమెంట్లు..!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

