Google Pay UPI Lite | గూగుల్ పే యూజర్లకు గుడ్‌న్యూస్..! ఇక సింగిల్ క్లిక్‌తో పేమెంట్లు..!
Google Pay UPI Lite | గూగుల్ పే యూజర్ల కోసం మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై వినియోగదారులు సింగిల్ క్లిక్‌తో పేమెంట్స్ చేసేలా సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. చిన్న చిన్న పేమెంట్స్ కోసం ప్రతీసారి యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా కొత్తగా UPI LITEని అందుబాటులోకి తీసుకువచ్చింది.
Google Pay UPI Lite | గూగుల్ పే యూజర్ల కోసం మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై వినియోగదారులు సింగిల్ క్లిక్‌తో పేమెంట్స్ చేసేలా సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. చిన్న చిన్న పేమెంట్స్ కోసం ప్రతీసారి యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా కొత్తగా UPI LITEని అందుబాటులోకి తీసుకువచ్చింది. లైట్ ఖాతా యూజర్ బ్యాంక్ అకౌంట్ అనుసంధానమై ఉంటుంది. అయితే, రియల్ టైమ్‌లో జారీ చేసే బ్యాంక్ కోర్ బ్యాకింగ్ వ్యవస్థపై ఆధారపడదని గూగుల్ పే వెల్లడించింది. యూజర్లు లైట్ అకౌంట్లో ఒకేసారి గరిష్ఠంగా రూ.2వేల వరకు మాత్రమే యాడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
రోజువారీ లిమిట్ రూ.4వేలు మాత్రమే ఉంటుంది. ఒకేసారి రూ.200 వరకు మాత్రమే యూపీఐ లైట్ ద్వారా పేమెంట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. చిన్న చిన్న లావాదేవీలు వేగవంతంగా పూర్తయ్యే లక్ష్యంతో పెట్టుకున్నామని, ఇందులో భాగంగా యూపీఐ లైట్‌ను తీసుకువచ్చినట్లు వైస్ ప్రెసిడెంట్ అంబరీష్ కెంఘే పేర్కొన్నారు. యూపీఐ లైట్ కోసం యూజర్లు తమ ప్రొఫైల్ పేజీకి వెళ్లి యాక్టివేట్ యూపీఐ లైట్‌ను ట్యాప్ చేయాలని, ఆ తర్వాత లింకింగ్ ప్రక్రియ పూర్తయ్యాక.. యూపీఐ అకౌంట్‌కు రూ.2వేల వరకు యాడ్ చేసుకోవచ్చని చెప్పారు. రోజుకు గరిష్ఠంగా రూ.4వేల వరకు మాత్రమే పరిమితి ఉంటుందని ఆయన తెలిపారు.
యూపీఐ లైట్ అకౌంట్లో యాడ్ చేసిన అమౌంట్.. రూ.200 కంటే తక్కువ పేమెంట్ చేసే సమయంలో యూపీఐ లైట్ అకౌంట్ డిఫాల్ట్‌గా ఉంటుందని, ఆయా పేమెంట్ల కోసం యూజర్లు యూపీఐ పిన్ను ఎంటర్ చేయాల్సి అవసరం ఉండదని తెలిపింది. ఇదిలా ఉండగా.. ఆర్బీఐ గతేడాది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా యూపీఐ లైట్ పేమెంట్ సిస్టమ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. యూపీఐ లావాదేవీల ప్రక్రియను సులభతరం చేసేందుకు యూపీఐ లైట్ ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇప్పటి వరకు కేవలం 15 బ్యాంకులు మాత్రమే మద్దతునిచ్చాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

