Nothing Phone (2) | దేశీ మార్కెట్లో జులై 11న నథింగ్ ఫోన్ 2 లాంఛ్
నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2)లాంఛ్ డేట్ ఎట్టకేలకు బయటకు వచ్చింది. జులై 11న ఈ 5జీ ఫోన్ భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
న్యూఢిల్లీ : నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2)లాంఛ్ డేట్ ఎట్టకేలకు బయటకు వచ్చింది. జులై 11న ఈ 5జీ ఫోన్ భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. జులై రెండో వారంలో లాంఛ్ ఈవెంట్ జరగనుంది. భారత్‌లో నథింగ్ ఫోన్ 2 రూ. 40,000కు ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. లేటెస్ట్ 5జీ ఫోన్ టీజర్లు ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలో సందడి చేస్తున్నాయి. ఈ ధరలో నథింగ్ ఫోన్ 2 వన్‌ప్లస్ 11ఆర్, గూగుల్ పిక్సెల్ 7ఏ వంటి స్మార్ట్ఫోన్లకు దీటైన పోటీ ఇస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
ఇక నథింగ్ ఫోన్ 1 భారత్‌లో రూ. 32,999కి ప్రవేశపెట్టారు. నథింగ్ ఫోన్ 2 డిజైన్ నథింగ్ ఫోన్ 1ను పోలిఉంటుందని చెబుతున్నారు. నథింగ్ ఫోన్ 1తో పోలిస్తే ఫోన్ 2 మరింత కస్టమైజేషన్ ఆప్షన్లు, ఫంక్షనాలిటీని కలిగిఉంటుందని కంపెనీ సీఈవో కార్ల్ పీ వెల్లడించారు. యూజర్లకు మెరుగైన సాఫ్ట్వేర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడంపై ఫోకస్ పెట్టినట్టు కంపెనీ సంకేతాలు పంపింది. యూజర్లకు రిఫ్రెషింగ్ లుక్‌ను అందించేందుకు న్యూ నథింగ్ ఫోన్ బ్యాక్ ప్యానెల్లో కొన్ని మార్పులు చేపట్టవచ్చని చెబుతున్నారు.
ఫోన్ 2 వెనుకభాగంలో సేమ్ ఎల్ఈడీ డిజైన్ ఉంటుందని భావిస్తున్నారు. నథింగ్ ఫోన్ 2 ఫ్లాగ్షిప్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్తో 6.7 ఇంచ్ డిస్ప్లే, ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 4700ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్ల ముందుకు రానుంది. ఇక నథింగ్ ఫోన్ 2 కెమెరా సెన్సర్ల వివరాలను ఇప్పటివరకూ కంపెనీ వెల్లడించలేదు.
Read More :
Xiaomi Pad 6 | పవర్ఫుల్ ప్రాసెసర్‌తో షియోమి ప్యాడ్ 6 లేటెస్ట్ ట్యాబ్లెట్ లాంఛ్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

