న్యూఢిల్లీ : నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2) జులైలో లాంఛ్ కానుందని కంపెనీ సీఈవో కార్ల్ పీ అధికారికంగా ప్రకటించారు. నెక్ట్స్ జనరేషన్ నథింగ్ ఫోన్ 2 క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్ఓసీ చిప్సెట్తో రానుందని అంతకుముందు కార్ల్ పీ వెల్లడించారు. ఫోన్ 2 బ్యాటరీ వివరాలను కార్ల్ వెల్లడిస్తూ నథింగ్ ఫోన్ 1తో పోలిస్తే ఫోన్ 2 బ్యాటరీ సామర్ధ్యం అధికంగా ఉంటుందని తెలిపారు.
ఫోన్ 2 4700ఎంఏహెచ్ బ్యాటరీతో కస్టమర్ల ముందుకొస్తుందని వెల్లడించారు. ఇది లేటెస్ట్ ఐఫోన్ 14 ప్రొ (3200ఎంఏహెచ్) ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ (4323ఎంఏహెచ్) బ్యాటరీ సామర్ధ్యం కంటే అధికం. అండ్రాయిడ్‌లో ఫోన్ 2 భారీ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉండటం కస్టమర్లను ఆకట్టుకుంటుందని కంపెనీ ఆశిస్తోంది. భారీ బ్యాటరీ సామర్ధ్యంతో ఫోన్ 2 ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుండటం సానుకూల అంశంగా చెబుతున్నారు.
ఫోన్ 2 డిజైన్‌ను ఇంకా నథింగ్ వెల్లడించలేదు. ఫోన్ మెయిన్ హైలైట్స్‌లో డిజైన్ కీలకమని చెబుతున్నారు. సేమ్ డిజైన్‌ను బ్రేక్ చేస్తామని నథింగ్ ఫోన్ 1 లాంఛ్ సందర్భంగా కంపెనీ వెల్లడించడంతో ఫోన్ 2 డిజైన్‌పై ఆసక్తి నెలకొంది.
Read More
ChatGPT | చాట్‌జీపీటీ సాయంతో ఏడాది లోపు 100 బుక్స్ రాసిన రచయిత