త్వరలో నథింగ్ ఫోన్ 2 గ్రాండ్ ఎంట్రీ
నథింగ్ ఫోన్ 1ను విజయవంతంగా లాంఛ్ చేసిన అనంతరం నథింగ్ పోన్ 2ను గ్లోబల్ మార్కెట్లో లాంఛ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది.
న్యూఢిల్లీ : నథింగ్ ఫోన్ 1ను విజయవంతంగా లాంఛ్ చేసిన అనంతరం నథింగ్ పోన్ 2ను గ్లోబల్ మార్కెట్లో లాంఛ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది. నథింగ్ ఫోన్ 2ను త్వరలో ప్రవేశపెడతామని కంపెనీ సహ వ్యవస్ధాపకుడు కార్ల్ పీ సంకేతాలు పంపారు. అయితే నథింగ్ ఫోన్ 2 తొలుత అమెరికా మార్కెట్లో లాంఛ్ కానుంది.
అమెరికన్ మార్కెట్‌పైనే తాము అధికంగా దృష్టి సారించామని పీ తెలిపారు. దీంతో నథింగ్ ఫోన్ 2 లాంఛ్ అయితే ముందుగా అమెరికాలోనే అందుబాటులో ఉంటుంది. భారత్ సహా ఇతర మార్కెట్ల కంటే ముందు అమెరికన్ మార్కెట్లో నథింగ్ లేటెస్ట్ ఫోన్‌ను లాంఛ్ చేయనున్నారు. నథింగ్ ఫోన్ 1ను యూఎస్‌లో కంపెనీ లాంఛ్ చేయలేదు. కంపెనీ తొలి స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 1కు కస్టమర్ల నుంచి విశేష ఆదరణ లభించింది.
నథింగ్ ఫోన్ 1 సక్సెస్‌తో పీ సారధ్యంలోని కంపెనీ నథింగ్ ఇయర్ 1, నథింగ్ ఇయర్ (స్టిక్) ఇయర్‌బడ్స్‌ను లాంఛ్ చేసింది. నథింగ్ ఫోన్ 1 హెచ్డీఆర్10+తో 6.55 ఇంచ్ ఫ్లెక్సిబుల్ ఓల్ఈడీ డిస్ప్లే, 33డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో 4500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం, 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్766 సెన్సర్, 50ఎంపీ శాంసంగ్ జేఎన్ఐ సెన్సర్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లను కలిగిఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లతో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778+ చిప్‌సెట్‌ను నథింగ్ ఫోన్ 1 కలిగిఉంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

