Artemis-1 @ NASA | నాసా మూన్ మిషన్.. జాబిలి వైపు దూసుకెళ్లిన ఆర్టెమిస్-1
Artemis-1 @ NASA | అవాంతరాలు ఎదురైనప్పటికీ ఆర్టెమిస్-1 రాకెట్‌ను నాసా విజయవంతంగా ప్రయోగించింది. చంద్రుడిపైకి మానవుడిని పంపేందుకు చేస్తున్న ప్రయోగాల్లో ఇది ఎంతో కీలకమైనది. దీని తర్వాత ఆర్టెమిస్-2, ఆర్టెమిస్-3 లను కూడా ప్రయోగించనున్నది.
Artemis-1 @ NASA | అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా మూన్ మిషన్ ‘ఆర్టెమిస్-1’ ఇవాళ ప్రయోగించారు. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.17 గంటలకు రాకెట్ జాబిల్లి వైపు దూసుకెళ్లింది. ప్రయోగించిన కొన్ని నిమిషాల అనంతరం చంద్రుని వైపు ఓరియన్ అంతరిక్ష నౌకను రాకెట్ విడిచిపెట్టింది. సోమవారం నాటికి ఓరియన్ చంద్రుడి ఉపరితలం నుంచి 96.5 కిలోమీటర్లు దాటిపోతుంది. దాదాపు 25 రోజులపాటు అంతరిక్షంలో గడిపిన అనంతరం డిసెంబర్ 11న పసిఫిక్ మహాసముద్రంలో పడనున్నది.
ఆర్టెమిస్-1 ప్రయోగం సాంకేతిక లోపాలు, వాతావరణ ప్రతికూలత కారణంగా గతంలో రెండు సార్లు ఆగస్ట్ 29, సెప్టెంబర్ 3న వాయిదా పడింది. మూడోసారి ప్రయోగం సందర్భంగా కూడా కొన్ని అవాంతరాలు తప్పలేదు. అయితే, వాటిని అధిగమించి రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించినట్లు నాసా తెలిపింది. రాకెట్లో హైడ్రోజన్ గ్యాస్ లీక్ అవుతుండగా శాస్త్రవేత్తలు సకాలంలో దాన్ని సరిచేశారు. కోర్ స్టేజ్‌లోని లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా విజయవంతంగా ఇంధనాన్ని నింపడంతో నాసా శాస్త్రవేత్తలు ఊపిరిపీల్చుకన్నారు.
ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రాకెట్ ఎస్ఎల్ఎస్.. ఓరియన్ స్పేస్ క్యాప్సూల్ కోసం తయారు చేశారు. ఈ రాకెట్‌ను నాసా 1972 లో చంద్రుడిపైకి అపోలో మిషన్‌లో పంపింది. 50 ఏండ్ల తర్వాత నాసా తిరిగి మూన్ మిషన్‌ను ప్రారంభించింది. ఈసారి అంతరిక్ష నౌక ఓరియన్ను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు నాసా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ ఎస్ఎల్ఎస్ను తయారు చేసింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

