చైనా తీరుపై నాసా సీరియస్

వాషింగ్టన్: అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా.. చైనా తీరుపై తీవ్రంగా మండిపడింది. తన అంతరిక్ష శిథిలాల విషయంలో బాధ్యతాయుతమైన ప్రమాణాలను పాటించడంలో చైనా ఘోరంగా విఫలమైందని విమర్శించింది. చైనా అతిపెద్ద రాకెట్ అయిన లాంగ్ మార్చ్ 5బీ నియంత్రణ కోల్పోయి ఆదివారం ఉదయం హిందూ మహాసముద్రంలో కూలిపోయిన కొద్ది గంటల తర్వాత నాసా దీనిపై స్పందించింది. నాసా అడ్మినిస్ట్రేలర్ బిల్ నెల్సన్ చైనా స్పేస్ ప్రోగ్రామ్‌ను దుయ్యబట్టారు. అంతరిక్షంపై కన్నేసిన దేశాలు వాళ్ల స్పేస్ ఆబ్జెక్ట్స్ తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశిస్తున్నప్పుడు భూమిపై ఉన్న ప్రజలు, వాళ్ల ఆస్తులకు ముప్పు కలగకుండా చూడాలి. ఈ ఆపరేషన్లలో పారదర్శకతను పెంచాలి అని నెల్సన్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
అంతరిక్ష కార్యకలాపాలను సుదీర్ఘ కాలం కొనసాగించడానికి, భద్రత, స్థిరత్వం కల్పించడానికి చైనా సహా అన్ని దేశాలు బాధ్యతగా, పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. గతంలో ఫ్లోరిడా నుంచి సెనేటర్‌గా ఉన్న ఆస్ట్రోనాట్ నెల్సన్.. మార్చిలో నాసా అడ్మినిస్ట్రేటర్ బాధ్యతలు చేపట్టారు. గత నెల 29న చైనా లాంచ్ చేసిన ఈ రాకెట్.. 100 అడుగుల పొడవు, 22 మెట్రిక్ టన్నుల బరువు ఉంది. ఇది నియంత్రణ కోల్పోవడంతో భూమిపై ఉన్న జనావాసాలపై ఎక్కడ కూలుతుందో అన్న ఆందోళన కలిగింది. చివరికి అదృష్టవశాత్తూ అది మాల్దీవ్స్‌కు చేరువలో హిందూ మహాసముద్రలో కూలింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

