NASA: సౌరవ్యవస్థ ఆవల 5,000 గ్రహాలు..నాసా 3డీ వీడియో విడుదల!!
మన సౌర వ్యవస్థకు ఆవల నాసా (అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ) 5,000 గ్రహాలను కనుగొన్నది. వీటికి సంబంధించిన 3డీ యానిమేషన్, సోనిఫికేషన్ వీడియోను కూడా విడుదల చేసింది. గత మూడు దశాబ్దాల్లో మొత్తం 5,000 గ్రహాలను కనుగొన్నట్లు నాసా వెల్లడించింది.
మన సౌర వ్యవస్థకు ఆవల నాసా (అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ) 5,000 గ్రహాలను కనుగొన్నది. వీటికి సంబంధించిన 3డీ యానిమేషన్, సోనిఫికేషన్ వీడియోను కూడా విడుదల చేసింది. గత మూడు దశాబ్దాల్లో మొత్తం 5,000 గ్రహాలను కనుగొన్నట్లు నాసా వెల్లడించింది. ఈ గ్రహాల్లో భూమిలాంటి చిన్న, రాతి ప్రపంచాలు, బృహస్పతిలాంటి పెద్ద గ్యాస్ జెయింట్లు, సూపర్ ఎర్త్స్ ఉన్నట్లు పేర్కొంది. అలాగే, మన భూమికంటే చిన్న గ్రహాలు.. నెప్ట్యూన్ సైజ్ గ్రహాలు కూడా ఉన్నట్లు వెల్లడించింది.
సౌరవ్యవస్థ ఆవల గుర్తించిన కొన్ని గ్రహాలను 3డీ విజువైలేషన్లో నాసా చూపించింది. ప్రతి ఎక్సోప్లానెట్ కనుగొన్నప్పుడు, ఆకాశంలో దాని స్థానంలో ఒక వృత్తం కనిపిస్తుంది. వృత్తం పరిమాణం.. గ్రహం కక్ష్య సాపేక్ష పరిమాణాన్ని సూచిస్తుంది. అలాగే, కనిపించే రంగు దానిని కనుగొనేందుకు ఏ గ్రహ గుర్తింపు పద్ధతిని ఉపయోగించారో తెలుపుతుంది. కొత్తగా కనిపెట్టిన ప్రతి గ్రహానికి ఒక నోట్ ప్లే చేయడం ద్వారా సంగీతాన్ని రూపొందించినట్లు నాసా తెలిపింది. నోట్ పిచ్.. ఆ గ్రహం సాపేక్ష కక్ష్యా కాలాన్ని సూచిస్తుంది. నక్షత్రాల చుట్టూ తిరిగేందుకు ఎక్కువ సమయం తీసుకునే గ్రహాలు తక్కువ నోట్స్‌లో వినిపిస్తాయి. , కక్ష్యలో వేగంగా తిరిగే గ్రహాలు ఎక్కువ నోట్స్‌లో వినిపిస్తాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

