Microsoft | విండోస్ 10 ఓఎస్ వాడే వారికి షాకింగ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం !
Microsoft | మీరు విండోస్ 10 ఓఎస్ వాడుతున్నారా? మీకో షాకింగ్ న్యూస్! ఇకపై మీ ల్యాప్‌టాప్/కంప్యూటర్‌కు మైక్రోసాఫ్ట్ సంస్థ నుంచి సెక్యూరిటీ సర్వీస్ సేవలు లభించవు. 2025 అక్టోబర్ 14వ తేదీ నుంచి విండోస్ 10 ఓఎస్‌కు సర్వీస్ సపోర్టు నిలిపివేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
Microsoft | మీరు విండోస్ 10 ఓఎస్ వాడుతున్నారా? మీకో షాకింగ్ న్యూస్! ఇకపై మీ ల్యాప్‌టాప్/కంప్యూటర్‌కు మైక్రోసాఫ్ట్ సంస్థ నుంచి సెక్యూరిటీ సర్వీస్ సేవలు లభించవు. 2025 అక్టోబర్ 14వ తేదీ నుంచి విండోస్ 10 ఓఎస్‌కు సర్వీస్ సపోర్టు నిలిపివేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఒకవేళ అదే నిజమైతే.. మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 24 కోట్ల కంప్యూటర్లు పనికిరాకుండా పోతాయని కెనాలిస్ రీసెర్చ్ ( canalys research ) అనే సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది.
కెనాలిస్ రీసెర్చ్ ప్రకారం.. ‘ విండోస్ 10 ఓఎస్‌కు మైక్రోసాఫ్ట్ సపోర్టు నిలిపివేస్తే.. మైక్రోసాఫ్ట్ నుంచి ఎలాంటి సెక్యూరిటీ అప్డేట్స్ రావు. దీనివల్ల యూజర్లు తప్పకుండా కొత్త కంప్యూటర్లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా కొత్త కంప్యూటర్లను కొనుగోలు చేయడం ద్వారా సుమారు 48 కోట్ల కిలోల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పోగవుతాయని నాలిస్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. అంటే ఇది 3.2 లక్షల కార్ల వ్యర్థాలతో సమానమని పేర్కొంది. అయితే ఈ వ్యర్థాల్లో హార్డ్ డ్రైవేలను డేటా స్టోరీజీ డివైజ్‌లుగా ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పింది. మిగిలిన ర్యామ్, మదర్ బోర్డుతో పాటు ఇతర విడిభాగాలను సరైన రీతిలో రీసైక్లింగ్ చేయడం ద్వారా ఉపయోగించుకోవచ్చని. అయితే సరైన రీతిలో రీసైకిల్ చేయకపోతే అవి పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది.
విండోస్ 10 ఓఎస్‌కు సపోర్టు నిలిచిపోయినప్పటికీ మరికొన్నేండ్లు వీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ సేఫ్టీ అప్డేట్స్ లేని పరికరాలకు డిమాండ్ చాలా తక్కువగా ఉంటుందని కెనాలిస్ రీసెర్చ్ అభిప్రాయపడింది. విండోస్10 ఓఎస్‌కు సపోర్టు నిలిపివేయాలని నిర్ణయించినప్పటికీ.. మైక్రోసాఫ్ట్ వద్ద మరో ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. 2028 అక్టోబర్ వరకు వార్షిక ఫీజు ప్రతిపాదనతో సెక్యూరిటీ అప్డేట్స్ ఇవ్వాలని ప్రతిపాదించినట్లు పేర్కొంది. దీనివల్ల యూజర్లకు ఎంతో కొంత మేలు జరుగుతుందని.. ఈ-వేస్ట్ పోగవ్వకుండా మరికొద్ది సంవత్సరాలు పాత కంప్యూటర్లను వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

