Meta’s Sandberg | శాండ్‌బర్గ్ కార్యకలాపాలపై మెటా ప్లాట్‌ఫామ్స్ దర్యాప్తు.. ఏం జరిగిందంటే!
Meta's Sandberg | మెటా ప్లాట్‌ఫామ్ సీవోవోగా వైదొలుగుతున్న షెర్ల్య్ శాండ్‌బర్గ్ తీరుపై అంతర్గత దర్యాప్తు సాగుతున్నది.
Meta’s Sandberg | ఫేస్బుక్ పేరెంట్ సంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్ నుంచి వైదొలగనున్న చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) షెర్ల్య్ శాండ్‌బర్గ్ కార్యకలాపాలపై సంస్థ న్యాయవాదులు విచారణ చేపట్టారు. ఏండ్ల తరబడి సంస్థ సీవోవోగా శాండ్‌బర్గ్.. సంస్థ వనరులను వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమెతో కలిసి పని చేసిన పలువురు ఉద్యోగులను విచారించారని శుక్రవారం వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక వార్తాకథనం ప్రచురించింది. దీనిపై స్పందించేందుకు మెటా ప్లాట్‌ఫామ్స్ గానీ, షెర్ల్య్ శాండ్‌బర్గ్ గానీ స్పందించలేదు.
శాండ్‌బర్గ్ తన ఫౌండేషన్ లీన్ ఇన్‌కు మద్దతుగా, తన రెండో పుస్తకం `ఆప్షన్ బీ: ఫేసింగ్ అడ్వర్సిటీ (Facing Adversity), బిల్డింగ్ రీసైలెన్స్ ( Building Resilience ), ఫైండింగ్ జాయ్ ( Finding Joy )` ప్రమోషన్ కోసం మెటా ఉద్యోగుల సహాయ సహకారాలపై మెటా ప్లాట్‌ఫామ్ యాజమాన్యం సమీక్షించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా నెట్వర్క్ వృద్ధిలో మెటా ప్లాట్ ఫామ్స్ (ఫార్మర్లీ ఫేస్బుక్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) మార్క్ జుకర్‌బర్గ్‌తో ఆమె కీలక భాగస్వామిగా ఉన్నారు. 14 ఏండ్ల సర్వీస్ తర్వాత ఈ నెల ప్రారంభంలో మెటా ప్లాట్‌ఫామ్స్ సీవోవోగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆమె స్థానంలో ప్రస్తుతం సంస్థ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ జావియర్ ఒలివాన్ నియామకానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుత వ్యవస్థలో శాండ్‌బర్గ్ పాత్రను రీప్లేస్ చేసేందుకు ఎటువంటి ప్రణాళిక లేదన్నారు. సంస్థ ఎగ్జిక్యూటివ్‌గా వైదొలిగినా మెటా ప్లాట్‌ఫామ్స్ డైరెక్టర్‌గా శాండ్‌బర్గ్ కొనసాగుతారని జుకర్‌బర్గ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

