రిక్రూటింగ్ కంపెనీలో లేఆఫ్స్ : లింక్డిన్ ఉద్యోగులపై వేటు
లింక్డిన్ తన రిక్రూటింగ్ టీం నుంచి పలువురు ఉద్యోగులను తొలగించింది. పలు విభాగాల్లో 10,000 మందిని తొలగించాలన్న మైక్రోసాఫ్ట్ ప్రణాళికల్లో భాగంగానే లింక్డిన్లో లేఆఫ్స్ చోటుచేసుకున్నాయి.
న్యూఢిల్లీ : ఉద్యోగార్ధులకు నూతన ఉద్యోగాల కోసం వారిని రిక్రూటర్లతో కనెక్ట్ చేసే వేదిక లింక్డిన్లోనూ కొలువుల కోత కలకలం రేపింది. లింక్డిన్ తన రిక్రూటింగ్ టీం నుంచి పలువురు ఉద్యోగులను తొలగించింది. పలు విభాగాల్లో 10,000 మందిని తొలగించాలన్న మైక్రోసాఫ్ట్ ప్రణాళికల్లో భాగంగానే లింక్డిన్లో లేఆఫ్స్ చోటుచేసుకున్నాయి. లింక్డిన్లో ఎంతమంది ఉద్యోగులపై వేటు పడుతుందనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. కాగా హోలోలెన్స్, ఎక్స్‌బాక్స్ వంటి ఇతర మైక్రోసాఫ్ట్ కంపెనీల్లోనూ కొలువుల కోతపై గత వారం కధనాలు వెల్లడయ్యాయి.
మరోవైపు పలువురు లింక్డిన్ రిక్రూటింగ్ టీం ఉద్యోగులు తాము కంపెనీ నుంచి దూరమవుతున్నామని ప్లాట్‌ఫాంపై పోస్ట్ చేయడంతో లింక్డిన్ లేఆఫ్స్ విషయం వెలుగులోకి వచ్చింది. లింక్డిన్లో ఉద్యోగం కోల్పోయిన వారిలో తాను ఒకరినని ఉద్యోగి నికోల్ జవకి రాసుకొచ్చారు. న్యూ రోల్ కోసం ప్రయత్నిస్తున్నానని ఆమె అదే ప్లాట్‌ఫాంను ఆశ్రయించారు.
లింక్డిన్లో కొలువు కోల్పోయిన టెక్నికల్ రిక్రూటర్ ఎమిలీ బియర్స్ తన లేఆఫ్‌పై రాసుకొస్తూ లింక్డిన్లో తన ప్రస్ధానం ముగియడం దురదృష్టకరమని, ఉద్యోగుల తొలగింపులో టెక్నికల్ రిక్రూటర్ రోల్‌ను కోల్పోయానని పేర్కొన్నారు. లింక్డిన్లో కొలువు కోల్పోయిన సీనియర్ రిక్రూటర్ మెలనీ క్వాండ్ తన ఆవేదన వెళ్లగక్కారు. కంపెనీ నుంచి తొలగిస్తూ కల్పించిన అరకొర ప్రయోజనాలు, పరిహార ప్యాకేజ్‌తో తాను పూర్తిగా నిరాశ చెందానని రాసుకొచ్చారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

