LG : ఎల్జీ అల్ట్రాగేర్ గేమింగ్ ల్యాప్‌టాప్ లాంఛ్..జనవరి నుంచి సేల్స్ షురూ!

న్యూఢిల్లీ : వచ్చే నెల లాస్‌వెగాస్‌లో జరిగే కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)కు ముందు లేటెస్ట్ అల్ట్రాగేర్ గేమింగ్ ల్యాప్‌టాప్‌ను ఎల్జీ లాంఛ్ చేసింది. ఎల్జీ అల్ట్రాగేర్ 17జీ90Q గేమింగ్ ల్యాప్‌టాప్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టంతో ముందుకొచ్చింది. సీఈఎస్ 2022 షోలో ఈ ల్యాప్‌టాప్‌కు సంబంధించి మరింత సమాచారం అందుబాటులోకి రానుంది.
2022 జనవరి నుంచి గేమింగ్ ల్యాప్‌టాప్ సేల్స్‌ను దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ప్రారంభించనుంది. ఎల్జీ అల్ట్రాగేర్ గేమింగ్ ల్యాప్‌టాప్ 11 జెన్ ఇంటెల్ టైగర్ లేక్ హెచ్ ప్రాసెసర్, ఎన్విదియా గెట్ఫోర్స్ ఆర్టీఎక్స్ 3080 మాక్స్-క్యూ గ్రాఫిక్స్ కార్డ్, డ్యూయల్ ఛానల్ మెమరీ, అల్ట్రా ఫాస్ట్ డ్యూయల్ ఎస్ఎస్డీ సెటప్‌తో ఆకట్టుకోనుంది.
గేమ్‌ను బట్టి ఎల్జీ అల్ట్రాగేర్ స్టూడియో యూజర్లను సీపీయూ, జీపీయూలను కంట్రోల్ చేసేందుకు అనుమతిస్తుంది. గేమింగ్ ల్యాప్‌టాప్‌తో పాటు నెంబర్ ప్యాడ్‌తో కూడిన ఫుల్ సైజ్ కీబోర్డు లభిస్తుంది. ఇక తొలుత కొరియాలో అందుబాటులో ఉండే ఎల్జీ అల్ట్రాగేర్ గేమింగ్ ల్యాప్‌టాప్‌ను ఆపై దశలవారీగా అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశపెడతారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

