జియోఫోన్ నెక్స్ట్ శకం రానే వచ్చింది. తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురు చూస్తున్న వినియోగదారులకు జియోఫోన్ నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్. అయితే.. ఈ ఫోన్‌ను కేవలం రూ.1999కే సొంతం చేసుకోవచ్చు. మిగితా అమౌంట్‌ను ఇన్స్టాల్మెంట్స్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫోన్ దివాళీ స్పెషల్‌గా లాంచ్ కాబోతున్న విషయం తెలిసిందే.
నిజానికి.. జియోఫోన్ నెక్స్ట్ ధర రూ.6499గా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎటువంటి ఈఎంఐ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోకపోతే రూ.6499 చెల్లించి జియోఫోన్ నెక్స్ట్ను కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ ఫైనాన్స్ ఆప్షన్ కావాలంటే.. ముందు రూ.1999 చెల్లిస్తే చాలు.. జియోఫోన్ నెక్స్ట్ను ఇచ్చేస్తారు.
ముందు 1999 రూపాయలు చెల్లించాక.. తర్వాతి నెల నుంచి 24 నెలల పాటు నెలకు 300 రూపాయల చొప్పున ఈఎంఐ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 350 రూపాయలు చెల్లిస్తే.. 18 నెలల పాటు చెల్లించాల్సి ఉంటుంది. రూ.1999 చెల్లించి ఫోన్‌ను కొనుగోలు చేస్తే.. ప్రతి నెల 5 జీబీ డేటాతో పాటు 100 నిమిషాల ఉచిత వాయిస్ కాలింగ్ ఆప్షన్ లభిస్తుంది.
ఒకవేళ వేరే ప్లాన్ కావాలనుకుంటే.. రూ.1999 చెల్లించి 24 నెలల పాటు నెలకు 450 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. లేదా 18 నెలల పాటు నెలకు రూ.500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా జియోఫోన్ నెక్స్ట్ను కొనుగోలు చేస్తే కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి.
ఎక్స్ఎల్ ప్లాన్ కావాలనుకుంటే.. ముందు రూ.1999 చెల్లించి ఆ తర్వాత 24 నెలల పాటు 500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. లేదా 18 నెలల పాటు రూ.550 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ప్రకారం కస్టమర్లకు రోజుకు 2 జీబీ డేటా, అల్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి.
ఎక్స్ఎక్స్ఎల్ ప్లాన్ ప్రకారం.. ముందుగా రూ.1999 చెల్లించాలి. ఆ తర్వాత 24 నెలల పాటు నెలకు రూ.550 చెల్లించాలి. లేదా 18 నెలల పాటు నెలకు రూ.600 చెల్లించాలి. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు రోజుకు 2.5 జీబీ డేటాతో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి.
జియోఫోన్ నెక్స్ట్ సేల్స్ దివాళీ నుంచి ప్రారంభం కానున్నాయి. కానీ.. ప్రి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాని కోసం దగ్గర్లోని జియో మార్ట్ డిజిటల్ స్టోర్ కానీ.. లేదా ఆన్లైన్లో జియో వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. వాట్సప్ ద్వారా కూడా జియోఫోన్ నెక్స్ట్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. దాని కోసం వాట్సప్‌లో Hi అని 7018270182 అనే నెంబర్‌కు మెసేజ్ పెట్టాలి. ఫోన్ లాంచ్ కాగానే వాట్సప్ ద్వారా నోటిఫికేషన్ పంపిస్తారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
JioPhone Next : దివాళీకి జియోఫోన్ నెక్స్ట్ విడుదల.. కన్ఫమ్ చేసిన గూగుల్ సీఈవో
JioPhone Next : రూ.3500 కే జియో ఫోన్.. ఫీచర్లు చూస్తే అబ్బా అనాల్సిందే.. సేల్స్ ఎప్పుడంటే?