Jio New Prepaid Plan: జియో న్యూ ప్లాన్.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే ఏడాది వరకు ఫ్రీ వాయిస్ కాల్స్, రోజూ 2.5 జీబీ డేటా
Jio New Prepaid Plan | ఇటీవల టారిఫ్ రేట్లు పెంచినా కూడా జియోకు ఆదరణ తగ్గలేదు. తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా జియో సరికొత్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.

Jio New Prepaid Plan | ప్రస్తుతం జియో టెలికాం రంగంలో దూసుకుపోతోంది. హైస్పీడ్ ఇంటర్నెట్ కావాలన్నా.. మారుమూల పల్లెలో కూడా సిగ్నల్ రావాలన్నా జియో తర్వాతనే ఏదైనా. అందుకే.. చాలామంది యూజర్లు జియోవైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల టారిఫ్ రేట్లు పెంచినా కూడా జియోకు ఆదరణ తగ్గలేదు. తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా జియో సరికొత్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.
ఇది వన్ ఇయర్ ప్లాన్. ఈ కొత్త ప్రీపెయిట్ ప్లాన్ మైజియో యాప్‌లో కానీ.. జియో వెబ్సైట్లో కానీ అందుబాటులో ఉంటుంది. ఈప్లాన్‌లో భాగంగా రూ.2999 పే చేస్తే సంవత్సరం మొత్తం ఉచితంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజూ 2.5 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. 100 ఉచిత ఎస్ఎంఎస్లు, జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాక్సెస్ కూడా లభిస్తుంది.

రూ.2999 ప్లాన్‌తో పాటు రూ.3119 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా జియోలో ఉంది. ఇది కూడా రూ.2999 ప్లాన్ బెనిఫిట్స్‌నే అందిస్తుంది. రోజుకు 2 జీబీ డేటా వస్తుంది. 10 జీబీ ఎక్స్ట్రా డేటాను ఈ ప్లాన్‌లో అందిస్తున్నారు. రూ.2879 ప్లాన్‌లో రోజూ 2 జీబీ డేలా వస్తుంది. ఒకవేళ లిమిట్ దాటిపోతే.. ఇంటర్నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు పడిపోతుంది.
ఇక.. రిలయెన్స్ జియో ఇటీవలే యూపీఐ ఆటో పే సర్వీస్‌ను తీసుకొచ్చింది. పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఈ సర్వీస్‌ను జియో తీసుకొచ్చింది. మై జియో యాప్‌లో యూపీఐ ఆటో పే సర్వీస్‌ను జియో కస్టమర్లు ఎనేబుల్ చేసుకోవచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

