విజయవంతంగా రోదసీలోకి దూసుకెళ్లిన జీశాట్-24
న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) జీశాట్-24 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాన్ని ఫ్రెంచ్ కంపెనీ ఏరియన్ స్పేస్ గురువారం ఫ్రెంచ్ గయానా (దక్షిణ అమెరికా)లోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్–5 రాకెట్‌తో ఇస్రో రోదసీలోకి పంపింది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్), కేంద్ర ప్రభుత్వం తరఫున డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్(డీఓఎస్) సంయుక్తంగా 4,180 కిలోల బరువు కలిగిన జీశాట్–24 ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టాయి.
ఈ ఉపగ్రహంలో 24 కేయూ బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్లు అమర్చి డీటీహెచ్ అప్లికేషన్ అవసరాలను తీర్చేందుకు పాన్ ఇండియా కవరేజీతో రోదసీలో పంపారు. జీశాట్–25తో డీటీహెచ్ అప్లికేషన్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. అంతరిక్ష రంగ సంస్కరణల తర్వాత న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) ప్రారంభించిన డిమాండ్ ఆధారిత కమ్యూనికేషన్ శాటిలైట్ మిషన్ ఇదేకావడం విశేషం. ఇదిలా ఉండగా.. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లో రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి ఈ నెల 30న సాయంత్రం 6 గంటలకు పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తున్నది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

