Budget 2024 : అంతరిక్షానికి అగ్ర తాంబూలం : స్పేస్‌కు రూ. 13,402 కోట్లు కేటాయింపు
Budget 2024 : పార్లమెంట్లో గురువారం ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో అంతరిక్ష విభాగానికి ప్రాధాన్యత దక్కింది. 2024-25 సంవత్సరానికి స్పేస్‌కు రూ. 13402 కోట్లు కేటాయించారు.
Budget 2024 : పార్లమెంట్లో గురువారం ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో అంతరిక్ష విభాగానికి ప్రాధాన్యత దక్కింది. 2024-25 సంవత్సరానికి స్పేస్‌కు రూ. 13402 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో రూ. 12,543 కోట్ల కేటాయింపులతో పోలిస్తే దాదాపు రూ. 500 కోట్లు అదనంగా కేటాయించారు.
చంద్రయాన్-3, ఆదిత్య ఎల్1 వంటి హైప్రొఫైల్ మిషన్స్ విజయవంతమైన నేపధ్యంలో స్పేస్‌కు కేటాయింపులను గణనీయంగా పెంచారు. అంతరిక్షానికి తొలి భారతీయుడిని పంపి 2035 నాటికి స్పేస్ స్టేషన్ నెలకొల్పాలన్న ఉద్దేశంతో చేపట్టిన ప్రతిష్టాత్మక గగన్‌యాన్ మిషన్‌కు ఈ కేటాయింపులు ఊతమిస్తాయని భావిస్తున్నారు.
అంతర్జాతీయ సహకరాంతో భారీ మిషన్లను చేపట్టే ప్రణాళికలతో ముందుకెళుతున్న ఇస్రో తాజా బడ్జెట్ కేటాయింపులపై సంతృప్తి వ్యక్తం చేయనుంది. ఇక 2024-25 బడ్జెట్లో శాస్త్ర సాంకేతిక రంగాలకు రూ. 242 కోట్లు అదనంగా రూ. 16,603 కోట్లు కేటాయించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లోని పలు విభాగాల్లో శాస్త్రీయ పరిశోధన, అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించడంతో ఈ రంగాలకు నిధుల కేటాయింపు పెంచారు.
Read More :
Nirmala Sitharaman: 2047 నాటికి వికసిత్ భారత్: మంత్రి నిర్మలా సీతారామన్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- allocations
- Budget 2024
- ISRO
- Space
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

