న్యూఢిల్లీ : ఐఫోన్ 13తో పోలిస్తే న్యూ ఫీచర్లు, పలు అప్గ్రేడ్లతో ఐఫోన్ 14 సిరీస్ కస్టమర్ల ముందుకు రానుంది. అప్డేటెడ్ సెల్ఫీ కెమెరాతో ఈ ఏడాది ఐఫోన్ మోడల్స్ ఆకట్టుకోనున్నాయి. ఐఫోన్ 14 సిరీస్‌లోని నాలుగు ఫోన్లలోని ట్రూడెప్త్ కెమెరా ఆటోఫోకస్ ఆఫర్ చేస్తాయని టెక్ ఎనలిస్ట్ మింగ్ చి కూ అంచనా వేశారు.
డార్క్లోనూ నైట్ మోడ్ లేకుండానే ఫోటోలకు బెటర్ లైటింగ్ ఉండేలా ఐపోన్ 14 సిరీస్‌లో డెప్త్ ఆప్ ఫీల్డ్ ఎఫెక్ట్‌ను జోడిస్తారని చెప్పారు. సెల్ఫీ తీసుకునే సమయంలో యూజర్లు తమ ఫేస్‌పై బెటర్ పోకస్ ఉండేలా ఆటోపోకస్ ఫీచర్ వెసులుబాటు కల్పిస్తుంది. ఐఫోన్ 13 సహా ప్రస్తుత ఐఫోన్ మోడల్స్ ఫిక్స్డ్ ఫోకస్ ఫీచర్‌ను కలిగిఉన్నాయి.
అప్‌గ్రేడెడ్ సెల్ఫీ కెమెరాతో పాటు ఐఫోన్ 14 మెరుగైన రియర్ కెమెరా సిస్టంతో కస్టమర్ల ముందుకు రానుంది. ఇక మిని ఐఫోన్ బదులు యాపిల్ నాన్-ప్రొ మ్యాక్స్ మోడల్‌ను లాంఛ్ చేయవచ్చని భావిస్తున్నారు. ఇక ఐఫోన్ 14 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ లాంఛ్ అవుతాయి. తొలి రెండు ఐఫోన్ 14 మోడల్స్ ప్రస్తుత మోడల్స్ సైజ్‌లోనే ఉంటాయని భావిస్తున్నారు.