న్యూఢిల్లీ : గత ఏడాది లాంఛ్ అయిన ఐఫోన్ 14 (iPhone 14) భారీ డిస్కౌంట్లపై అందుబాటులో ఉండగా అయితే ఫ్లిప్‌కార్ట్‌పై ఎన్నడూ లేనంతగా తక్కువ ధరకు ఐఫోన్ 14 అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 ధర రూ. 79,900 కాగా ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ప్రీమియం ఫోన్ రూ. 70,999కి లిస్టయింది.
రూ 9000 ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డుదారులకు మరో 4000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ హాట్ డివైజ్‌పై ఏకంగా రూ. 13,000 డిస్కౌంట్ లభించడంతో ఈ-కామర్స్ దిగ్గజంపై ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 66,000కు దిగివచ్చింది. పాత ఐఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయదలుచుకుంటే ఫ్లిప్‌కార్ట్ ఏకంగా రూ. 30,000 వరకూ ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందిస్తోంది.
ఈ రకంగా ఐఫోన్ 14 ఫైనల్ ధర మరింత తగ్గుతుంది. అయితే మోడల్‌ను, ఫోన్ పరిస్ధితిని బట్టి ఎక్స్ఛేంజ్ విలువ ఆధారపడిఉంటుంది. ఇక ఐఫోన్ 13 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 61,999కి లభిస్తుండగా మరో ఐదు వేలు అదనంగా వెచ్చిస్తే ఐఫోన్ 14ను సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 14ను గతంలో కొనుగోలు చేయని వారు, ఈ ఫోన్‌పై ఆసక్తి ఉన్నవారికి దీన్ని సొంతం చేసుకునేందుకు ఇదే సరైన అవకశామని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.