న్యూఢిల్లీ : ఐఫోన్ 14 సిరీస్ లాంఛ్ అనంతరం యాపిల్ ఐఫోన్ 13 ధరలను అధికారికంగా తగ్గించింది. భారత్‌లో ఐఫోన్ 13 రూ 69,990 నుంచి ప్రారంభమవుతుందని యాపిల్ ఇండియా స్టోర్‌లో వెల్లడించగా ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో రూ 59,990కి అందుబాటులో ఉంది. దీనికి అదనంగా బ్యాంకు డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లు కలుపుకుంటే మరింత తక్కువకే ఐఫోన్ 13ను కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు.
బిగ్ దివాళీ సేల్ సందర్భంగా ఐఫోన్ 13పై ఫ్లిప్‌కార్ట్ రూ 10,000 ఫ్లాట్ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఎస్బీఐ కార్డుదారులు రూ 1250 డిస్కౌంట్‌ను పొందుతారు.ఆపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ 16,900 లభిస్తుండగా ఐఫోన్ 13 ఫ్లిప్‌కార్ట్‌పై రూ 42,000కే కస్టమర్లకు అందుబాటులో ఉంది.
యాపిల్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 14 ఫీచర్లకు దగ్గరగా తక్కువ ధర లోనే ఐఫోన్ 13 లభిస్తుండటంతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు మొగ్గుచూపుతున్నారు. భారత్‌లో ఐఫోన్ 14 రూ 79,900 నుంచి అందుబాటులో ఉంది. 6.1 ఇంచ్ లిక్విడ్ రెటీనా డిస్ప్లే, ఏ15 బయోనిక్ చిప్, ఐఓఎస్ 16, డ్యూయల్ కెమెరాలు, వైడ్ నాచ్ వంటి పలు ఫీచర్లతో ఐఫోన్ 14 కస్టమర్ల ముందుకొచ్చింది.