న్యూఢిల్లీ : ఐఫోన్‌ను అమితంగా ఇష్టపడేవారు దాని ధరను చూసి వెనక్కితగ్గుతుంటారు. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 12 మినీపై ఏకంగా 36 శాతం డిస్కౌంట్ ఇస్తుండటంతో హాట్ డివైజ్‌ను కస్టమర్లు తక్కువ ధరకే సొంతం చేసుకునే వెసులుబాటు లభిస్తోంది. బ్లాక్ ఐఫోన్ 12 మిని 64జీబీ వేరియంట్‌పై ఫ్లిప్‌కార్ట్ ఆకర్షణీయ ఆఫర్లను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది.
ఈ డీల్‌తో పాటు ఇతర డీల్స్‌తో కలిసి ఐఫోన్ 12 మినీ మరింత తక్కువ ధరకు లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్సీ ఫస్ట్ క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం వరకూ ఆఫర్ పొందవచ్చు. ఇండస్ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపైనా పది శాతం ఆఫర్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారు ఐదు శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందే వెసులుబాటు ఉంది.
ఇక యూపీఐ లావాదేవీలపై రూ . 250 ఆఫర్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 12 మినీని మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకునే వారు పాత ఫోన్ ఎక్స్ఛేంజ్పై రూ . 23,000 వరకూ పొందే అవకాశం ఉంది.