Instagram : యూజర్ల కోసం ఇన్స్టాగ్రాం తీపికబురు అందించింది. మెసేజ్‌లు పంపిన 15 నిమిషాల్లోగా వాటిని ఎడిట్ చేసుకునే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ వాట్సాప్, టెలిగ్రాం వంటి ప్లాట్‌ఫాంలపై ఇప్పటికే అందుబాటులో ఉంది. పొరపాట్లతో మెసేజ్‌ను పంపిన వారికి ఈ ఫీచర్ మంచి వెసులుబాటు కల్పిస్తుంది.
టైపింగ్ ఎర్రర్, ఇతర తప్పులు, మనసు మార్చుకోవడం వంటి ఎలాంటి కారణాలతో మెసేజ్‌లో తప్పులు దొర్లినా వాటిని అన్సెండింగ్ చేయకుండానే ఎడిట్ చేసుకునే సౌలభ్యం కలగనుంది. ఇక మెసేజ్ ఎడిటింగ్ కోసం ఇన్‌స్టా యాప్‌ను ఓపెన్ చేసి కాన్వర్సేషన్‌లో మీరు ఇటీవల పంపిన మెసేజ్‌ను లొకేట్ చేయాలి. ఆపై మెసేజ్‌ను ప్రెస్ చేసి హోల్డ్ చేసి కనిపించే ఆప్షన్స్ నుంచి ఎడిట్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
టైం లిమిట్ దాటిన తర్వాత ఈ ఆప్షన్ అందుబాటులో ఉండదని గమనించాలి. ఇక ఎడిట్ సెలక్ట్ చేసుకున్న తర్వాత మీరు పంపిన మెసేజ్‌ను సవరించవచ్చు. మార్పులు చేపట్టిన తర్వాత చాట్‌లో మీ మెసేజ్‌ను అప్డేట్ చేసేందుకు సెండ్‌ను ట్యాప్ చేయాలి.
Read More :