Infinix Hot 30i | మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్.. ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ.. ఇవీ స్పెషిఫికేషన్స్!
Infinix Hot 30i | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీసంస్థ ఇన్ఫినిక్స్.. దేశీయ మార్కెట్లోకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ తెచ్చింది. దీని ధర కేవలం రూ.8999 మాత్రమే.
Infinix Hot 30i | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ ఇండియా (Infinix India) సోమవారం భారత్ మార్కెట్లోకి సరికొత్త ఫోన్ తీసుకొచ్చింది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ (Infinix Hot 30i) పేరుతో ఫోన్‌ను ఆవిష్కరించింది. 6.60-అంగుళాల డిస్ప్లే, 16 జీబీ రామ్ విస్తరణ సామర్థ్యం గల ఈ ఫోన్లో 50-మెగా పిక్సెల్ కెమెరా ఉంది.
బ్లాక్ ప్యానెల్‌పై డైమండ్ కట్ డిజైన్‌తో వస్తున్న ఇన్ఫినిక్స్ హాట్ 30 ఐ (Infinix Hot 30i) ఫోన్.. రియల్మీ పాత ఫోన్లను పోలి ఉంటుంది. రియల్మీ, రెడ్మీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లకు ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ గట్టి పోటీ ఇవ్వనున్నదని తెలుస్తున్నది.
8జీబీ రామ్ విత్ 128 ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీతో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.8,999 మాత్రమే. ఇప్పటికే ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి. కొనుగోలుదారులు వచ్చే నెల మూడో తేదీ నుంచి ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డుపై ఐదు శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్, ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. డైమండ్ వైట్, గ్లాసియర్ బ్లూ, మిర్రర్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.
ఇవీ స్పెషిఫికేషన్స్
- ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ ఫోన్ రేర్ ప్యానల్‌పై రైట్ సైడ్ డ్యుయల్ కెమెరా సెటప్‌తో వస్తున్నది.
- ఏఐ లెన్స్ విత్ 50 మెగా పిక్సెల్స్ సెన్సార్ కలిగి ఉంటుంది.
- వీడియో కాల్స్, సెల్ఫీలకు 5-మెగా పిక్సెల్ కెమెరా లభ్యం. ఫ్రంట్ ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది.
- ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ ఫోన్లో వర్చువల్ రామ్ పవర్ కల్పించారు. ఇందులో 16 జీబీ రామ్ వరకు పెంచుకోవచ్చు.
- మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకు ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ లభిస్తుంది.
- 6.6-అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఆన్ ఎల్సీడీ ప్యానెల్ విత్ 90 హెర్ట్జ్. డిస్ప్లే టాప్‌పై `యూ`నాచ్ లభ్యం.
- మీడియా టెక్ హీలియో జీ 37 ఒక్టాకోర్ ప్రాసెసర్ విత్ 2.3 గిగాహెర్ట్జ్, గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 యూపీయూ లభ్యం.
- ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఎక్స్ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టమ్)12పై పని చేస్తుంది.
- 10 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ లభ్యం.
- సెక్యూరిటీ కోసం ఫోన్ సైడ్ ప్యానెల్‌పై ఫింగర్ ప్రింట్ సెన్సార్.
- డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, 3.5 ఎంఎం జాక్తోపాటు ఇతర బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు లభ్యం.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీ అరేబియాలో ఎయిర్‌పోర్టుపై హౌతీల దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
Daler Mehndi | దలేర్ మెహందీ వివాదంపై పీఎం మోదీకి FWICE లేఖ.. కళాకారుల పట్ల సంయమనం పాటించాలని విజ్ఞప్తి!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

