iPhone 15 | ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్‌లో ఆకట్టుకునే ఫీచర్లివే..!
వచ్చే ఏడాది రానున్న ఐఫోన్ 15 సిరీస్‌పై అంచనాలు ఊపందుకున్నాయి. నెక్ట్స్ జనరేషన్ ఐఫోన్ల ఫీచర్లు ఇవేనంటూ పలు లీక్‌లు నెట్టింట సందడి చేస్తున్నాయి.
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది రానున్న ఐఫోన్ 15 సిరీస్‌పై అంచనాలు ఊపందుకున్నాయి. నెక్ట్స్ జనరేషన్ ఐఫోన్ల ఫీచర్లు ఇవేనంటూ పలు లీక్‌లు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఐఫోన్లలో తొలిసారిగా ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్ పెరిమాక్స్ జూమ్ లెన్స్‌తో కస్టమర్ల ముందుకు రానుందని టెక్ నిపుణులు మింగ్ చి కూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఇది రెగ్యులర్ ప్రొ మోడల్లో అందుబాటులో ఉండదని చెబుతున్నారు. పెరిస్కోప్ లెన్స్‌తో యూజర్లు బ్యాక్‌గ్రౌండ్ బ్లర్‌తో మెరుగైన ఫోటోలను క్యాప్చర్ చేసే వెసులుబాటు కలుగుతుంది. ఫొటోగ్రాఫర్, సబ్జెక్ట్ మధ్య దూరాన్ని పెరిస్కోప్ జూమ్ కెమెరాలు తగ్గించడంతో దూరం నుంచి కూడా మెరుగైన ఫోటోలను క్లిక్ చేయవచ్చు.
ఇక గతంలో ఒప్పో తొలిసారిగా స్మార్ట్ఫోన్లలో పెరిస్కోప్ లెన్స్‌ను ప్రవేశపెట్టింది. పెరిస్కోప్ లెన్స్‌తో ప్రైమరీ కెమెరా కంటే ఐదు రెట్లు అధికంగా నాణ్యతతో కూడిన ఫోటోలు తీసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా కూడా 10x ఆప్టికల్ జూమ్ నుంచి 100x డిజిటల్ జూమ్ వరకూ సపోర్ట్ చేసే పెరిస్కోప్ లెన్స్‌ను కలిగిఉంది. ఇక ఐఫోన్ 13 ప్రొ మోడల్స్ టెలిఫొటో లెన్స్‌తో కస్టమర్ల ముందుకొచ్చాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

