IIT Palakkad | ఏఐలో ఫ్రీ ఆన్లైన్ కోర్స్ ఆఫర్ చేస్తున్న ఐఐటీ పలక్కాడ్
ఎన్పీటీఈఎల్ ప్లాట్‌ఫాంపై ఐఐటీ పలక్కాడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో విద్యార్ధులకు 12 వారాల ఉచిత ఆన్లైన్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
న్యూఢిల్లీ : ఎన్పీటీఈఎల్ ప్లాట్‌ఫాంపై ఐఐటీ పలక్కాడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో విద్యార్ధులకు 12 వారాల ఉచిత ఆన్లైన్ కోర్సును ఆఫర్ చేస్తోంది. అప్లైడ్ యాక్లెరేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో ఈ కోర్సును అందిస్తోంది. స్మార్ట్ సిటీ, హెల్త్‌కేర్ రంగాల్లో ఏఐ ఆధారిత సొల్యూషన్స్‌ను పరిశ్రమకు ఎలా అందించాలనే దానిపై బేసిక్స్‌ను ఈ కోర్సులో భాగంగా విద్యార్ధులకు శిక్షణ ఇస్తారు.
మెషీన్ లెర్నింగ్, ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పనిచేస్తున్న కంపెనీల నుంచి కూడా విద్యార్ధులకు సహకారం లభిస్తుంది. సైన్స్, ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ స్కాలర్స్, పీజీ విద్యార్ధులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఐఐటీ పలక్కాడ్ ఆఫర్ చేసే ఉచిత ఆన్లైన్ ఏఐ కోర్సు ఉపయుక్తంగా ఉంటుంది. ఏఐలో శిక్షణ పొందే విద్యార్ధులకు కంప్యూటర్ ఆర్గనైజేషన్‌లో పనిచేసిన అనుభవం, మెరుగైన కంప్యూటింగ్ నైపుణ్యాలు, మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్‌పై అవగాహన ఉండాలి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

