Covid Vaccine Certificate : యాప్స్, వెబ్‌సైట్స్ ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకోవడం ఎంత ముఖ్యమో.. దానికి సంబంధించిన సర్టిఫికెట్‌ను తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే.. విదేశాలకు వెళ్లాలన్నా.. ఇండియాలో వేరే రాష్ట్రాలకు వెళ్లాలన్నా.. టూరిస్టు ప్రాంతాలకు వెళ్లాలన్నా కోవిడ్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఆఫీసులలో కూడా ఈ సర్టిఫికెట్‌ను అడుగుతున్నారు. తమ ఉద్యోగులు ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకొని.. ఆ సర్టిఫికెట్‌ను ఆఫీసులో అందజేయాలని ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు ఉద్యోగులకు సూచిస్తున్నాయి.

చాలామందికి వ్యాక్సిన్ వేసుకోవడం తెలుసు కానీ.. ఆ సర్టిఫికెట్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి.. ఎక్కడ తీసుకోవాలి.. అనే విషయం తెలియదు. ఇటీవలే.. వాట్సప్ ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. ఒక్క వాట్సప్ ద్వారానే కాదు.. పలు యాప్స్, వెబ్సైట్ల ద్వారా కోవిడ్ 19 వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి? ఏ యాప్స్‌లో ఆ ఆప్షన్ ఉందో తెలుసుకుందాం రండి.
Aarogya Setu

కరోనా మొదటి వేవ్ ప్రారంభ దశ నుంచే అందరూ ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా తమ చుట్టుపక్కల ఎంతమంది కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లు ఉన్నారో తెలుసుకునేవాళ్లు. ప్రధాని మోదీ కూడా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని దేశ ప్రజలందరికీ సూచించారు. ఇప్పుడు ఆదే యాప్ నుంచి కోవిడ్ 19 వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికోసం ఆరోగ్యసేతు యాప్‌ను ఓపెన్ చేసి.. వ్యాక్సినేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి.. వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు రిజిస్టర్ చేసుకున్న ఫోన్ నెంబర్‌ను ఎంటర్ చేసి.. ఓటిపీని వెరిఫై చేస్తే చాలు. సర్టిఫికెట్ ఐకాన్ మీద క్లిక్ చేసి సర్టిఫికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవడమే.
Cowin website

మీ ఫోన్ లేదా పీసీ ద్వారా www.cowin.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి.. రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేశాక.. సర్టిఫికెట్ బటన్ మీద క్లిక్ చేసి వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

వాట్సప్ ద్వారా చాలా సులభంగా కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కరోనా హెల్ప్ డెస్క్ నెంబర్ 9013151515 ను ముందు ఫోన్లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాట్సప్ ఓపెన్ చేసి.. ఈ నెంబర్ చాట్ బాక్స్‌ను ఓపెన్ చేసి.. Covid certificate అని టైప్ చేయాలి. దీంతో మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని చాట్ బాక్స్‌లో టైప్ చేశాక.. వెంటనే చాట్ బాక్స్‌లోనే కోవిడ్ వ్యాక్సిన్ సర్టిపికెట్ పీడీఎఫ్ పార్మాట్లో షేర్ చేస్తారు. దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
MyGov app and website

మైగవ్ యాప్ లేదా వెబ్సైట్.. ఎందులోనైనా కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికోసం యాప్ లేదా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి Get your vaccination certificate అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేస్తే వెంటనే సర్టిఫికెట్ డౌన్లోడ్ అవుతుంది.
Umang app

కేంద్ర ప్రభుత్వం నుంచి లభించే పాస్‌పోర్ట్, పాన్‌కార్డు, పీఎఫ్ లాంటి సర్వీసుల కోసం ఉమంగ్ యాప్‌ను ఉపయోగిస్తారు. కోవిన్ కూడా ఈ యాప్‌లో ఒక భాగమే. ఉమంగ్ యాప్ లేదా వెబ్సైట్ ఓపెన్ చేసి కోవిన్ అని సెర్చ్ చేసి.. డౌన్లోడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలంటూ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక.. ఓటీపీని వెరిఫై చేసుకొని సర్టిఫికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Digilocker

ఏవైనా సర్టిఫికెట్లను డిజిటల్ ఫార్మాట్లో పంపించేందుకు ఉపయోగపడేదే ఈ యాప్. ఇందులో కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను కూడా పొందొచ్చు. దానికోసం ముందు అకౌంట్ క్రియేట్ చేసుకొని.. కోవిడ్ 19 అని సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి. కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే.. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆప్షన్ మీద క్తిక్ చేసి.. బెనిఫిషియరీ ఐడీని ఎంటర్ చేసి..డాక్యుమెంట్ బటన్ మీద క్లిక్ చేయగానే.. కోవిడ్ 19 సర్టిఫికెట్‌ను డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి సర్టిఫికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవడమే.
Paytm

ప్రముఖ వాలెట్ పేటీఎం ద్వారా కూడా కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని కోసం యాప్‌ను ఓపెన్ చేసి Covid-19 Vaccine Slot Finder అని సెర్చ్ చేస్తే.. View beneficiaries అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి.. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి.. ఓటీపీని వెరిఫై చేసి సర్టిఫికెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవడమే.
Eka Care

ఎకా కేర్ అనేది ప్రభుత్వేతర యాప్. ఈ యాప్ ద్వారా కూడా వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని కోసం యాప్ ఓపెన్ చేసి కోవిన్ సర్టిఫికెట్ బటన్ మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీని వెరిఫై చేసుకుంటే చాలు. సర్టిఫికెట్‌ను డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అక్కడ కనిపిస్తుంది.
Reliance JioHealth Hub

మైజియో యాప్ లేదా జియో హెల్త్ హబ్ యాప్‌ను ఓపెన్ చేసి కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్, ఓటీపీ ఎంటర్ చేసి సర్టిఫికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

