HMD Vibe 5G | హెచ్ఎండీ సంస్థ అత్యంత చవక ధరకే ఓ నూతన 5జి స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీంతోపాటు మరో రెండు 4జి ఫీచర్ ఫోన్లను కూడా మార్కెట్లో ప్రవేశపెట్టింది. హెచ్ఎండీ వైబ్ 5జి, హెచ్ఎండీ 101 4జి, 102 4జి పేరిట ఈ ఫోన్లను లాంచ్ చేశారు. అత్యంత చవక ధరకే ఈ ఫోన్లు లభించడంతోపాటు వీటిల్లో ఆకర్షణీమైన ఫీచర్లను అందిస్తున్నారు. హెచ్ఎండీ వైబ్ 5జి స్మార్ట్ ఫోన్లో 6.67 ఇంచుల ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఫోన్లో యూనిసోక్ టి760 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇచ్చారు.
హెచ్ఎండీ వైబ్ 5జి స్మార్ట్ ఫోన్లో 4జీబీ ర్యామ్ లభిస్తుంది. 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. మెమొరీని కార్డు ద్వారా 256జీబీ వరకు పెంచుకునే సదుపాయం కల్పించారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తుంది. 2 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందించనున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఈ ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్‌ను ఇచ్చారు. ఎల్ఈడీ ఫ్లాష్ సదుపాయం ఉంది. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంటుంది. 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ లభిస్తుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు సదుపాయాలు కూడా ఉన్నాయి. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని అమర్చారు. దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ లభిస్తుంది. చార్జర్‌ను కూడా ఫోన్‌తోపాటు అందిస్తున్నారు.
హెచ్ఎండీ 1014జి, 102 4జి ఫీచర్ ఫోన్లకు చెందిన సదుపాయాలు ఇలా ఉన్నాయి. ఈ ఫోన్లలో 2 ఇంచుల డిస్ప్లే ఉండగా, యూనిసోక్ 8910ఎఫ్ఎఫ్-ఎస్ ప్రాసెసర్ ఉంది. 16ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. మెమొరీని కార్డు ద్వారా 32జీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్లలో ఆర్టీఓఎస్ ఎస్30ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇచ్చారు. వెనుక వైపు క్యూవీజీఏ కెమెరా ఉండగా, కేవలం హెచ్ఎండీ 102 4జిలో మాత్రమే వెనుక వైపు ఫ్లాష్ సదుపాయాన్ని ఇచ్చారు. ఎఫ్ఎం రేడియో, ఎంపీ3 ప్లేయర్, క్లౌడ్ యాప్స్, లోకల్ లాంగ్వేజ్ సపోర్ట్, డ్యుయల్ సిమ్, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి, 3.5ఎంఎం ఆడియో జాక్, ఐపీ 52 డస్ట్ అండ్ స్ల్పాష్ ప్రూఫ్, 1000 ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ వంటి ఫీచర్లను ఈ ఫోన్లలో అందిస్తున్నారు.
Hmd 102 101
హెచ్ఎండీ వైబ్ 5జి ఫోన్‌ను బ్లాక్, పర్పుల్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయగా, ఈ ఫోన్‌కు చెందిన సింగిల్ వేరియెంట్ ధర రూ.8,999గా ఉంది. అలాగే హెచ్ఎండీ 101 4జి ఫోన్‌ను డార్క్ బ్లూ, రెడ్, బ్లూ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయగా, ఈ ఫోన్ ధర రూ.1899గా ఉంది. హెచ్ఎండీ 102 4జి ఫోన్‌ను డార్క్ బ్లూ, రెడ్, పర్పుల్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయగా ఈ ఫోన్ ధరను రూ.2199గా నిర్ణయించారు. ఈ మూడు ఫోన్లను అన్ని ప్రధాన రిటెయిల్ స్టోర్లతోపాటు ఈ-కామర్స్ స్టోర్స్‌లో, హెచ్ఎండీ ఆన్లైన్ స్టోర్‌లో విక్రయిస్తున్నారు.