సాఫ్ట్వేర్ కంపెనీలకు దడపుట్టిస్తున్న రాన్సమ్వేర్.. దీని నుంచి కంప్యూటర్ను ఎలా కాపాడుకోవాలి?
Ransomware | ఇలాంటి మాల్వేర్ల్లో రాన్సమ్వేర్ అత్యధిక ప్రమాదకరమైనది. ఒక్కసారి ఈ మాల్వేర్ మన కంప్యూటర్లోకి ప్రవేశిస్తే.. దానిద్వారా నెట్‌వర్క్‌లోని అన్ని కంప్యూటర్లు, చివరగా సర్వర్లోనూ ఇది చొరబడుతుంది.

Ransomware | రోజురోజుకీ హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. ఈ సైబర్ నేరగాళ్ల వలలో కేవలం సాధారణ వ్యక్తులు మాత్రమే కాకుండా పెద్ద పెద్ద కంపెనీలు కూడా పడిపోయి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇలా సాఫ్ట్వేర్ కంపెనీలు.. కార్పొరేట్ సంస్థలను గజగజలాడిస్తున్న మాల్వేర్లలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రాన్సమ్వేర్. రెండేళ్ల క్రితం 80 శాతం మంది భారతీయ కంపెనీలు ఈ రాన్సమ్వేర్ బారిన పడగా.. మన హైదరాబాద్‌లో బాధిత కంపెనీలు 74 శాతంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రాన్సమ్వేర్ అంటే ఏంటి? అది ఎలా దాడి చేస్తుంది? దాని నుంచి ఎలా రక్షణ పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

రాన్సమ్వేర్ ఏం చేస్తుంది?
సాధారణంగా కంప్యూటర్ వైరస్లు ఒక కంప్యూటర్లోని ఫైళ్లను కరెప్ట్ చేస్తే.. మాల్వేర్లు మొత్తం కంప్యూటర్లనే హ్యాకర్ల నియంత్రణలోకి తీసుకెళ్తాయి. ఇలాంటి మాల్వేర్ల్లో రాన్సమ్వేర్ అత్యధిక ప్రమాదకరమైనది. ఒక్కసారి ఈ మాల్వేర్ మన కంప్యూటర్లోకి ప్రవేశిస్తే.. దానిద్వారా నెట్‌వర్క్‌లోని అన్ని కంప్యూటర్లు, చివరగా సర్వర్లోనూ ఇది చొరబడుతుంది. ఈ మాల్మేర్ కంప్యూటర్లోకి ప్రవేశించగానే.. నెమ్మదిగా అన్ని ఫైల్స్, ఫోల్డర్లను ఎన్‌క్రిప్ట్ చేసేస్తుంది. దీంతో కంప్యూటర్ లాక్ అయిపోతుంది. అప్పుడు వాటిని ఓపెన్ చేయడం సాధ్యం కాదు. వీటిని ఓపెన్ చేయాలంటే హ్యాకర్లు అడిగిన డబ్బులు చెల్లించుకోవాల్సిందే.

పైరెటెడ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ( ఓఎస్)లోని లొసుగుల ఆధారంగా హ్యాకర్లు ఈ మాల్వేర్ సహాయంతో దాడికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఓఎస్‌లోని ఎన్టీఎల్ఎం ( న్యూటెక్నాలజీ ల్యాన్ మేనేజర్) సెక్యూరిటీ ప్రోటోకాల్ సర్వీస్ మెసేజ్ బ్లాక్ (ఎస్ఎంబీ) ప్రోటోకాల్ హ్యాకర్లకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఒక కంపెనీలో ఒక్క కంప్యూటర్లో పైరసీ ఓఎస్ ఉన్నా.. దాని ద్వారా నెట్‌వర్క్‌లోని అన్ని కంప్యూటర్లకు ఈ రాన్సమ్వేర్ విస్తరిస్తుంది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
డాటా బ్యాకప్: రాన్సమ్వేర్ బారినపడ్డా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనుకుంటే మన డాటాను బ్యాకప్ చేసుకోవాలి. రాన్సమ్వేర్ పంపి మన డాటాను ఎన్‌క్రిప్ట్ చేసినా బ్యాకప్‌తో సేవ్ అవ్వొచ్చు.
అనుమానాస్పద లింక్‌లు ఓపెన్ చేయవద్దు: చాలావరకు రాన్సమ్వేర్ దాడుల్లో లింక్‌లు, అటాచ్మెంట్లను పంపి చేసేవే. అందుకే అనుమానాస్పద లింక్‌లు, అటాచ్మెంట్లను తెరువొద్దు.
అప్డేటెడ్ యాంటీవైరస్ తప్పనిసరి: కంప్యూటర్లో అప్డేటెడ్ యాంటీవైరస్‌ను తప్పక పెట్టుకోవాలి.
సైబర్ సెక్యూరిటీ పాలసీ: యూజర్ యాక్సెస్ కంట్రోల్, పాస్వర్డ్ మేనేజ్మెంట్, సోషల్ మీడియా రూల్స్‌పై అవగాహన కలిగి ఉండాలి.
ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్: సైబర్ ఎటాక్ జరిగితే ఎలా డాటా రికవరీ చేసుకోవాలన్నదానికి ఒక ముందస్తు ఎమర్జెన్సీ రివకరీ ప్లాన్ తప్పనిసరి.
సైబర్ సెక్యూరిటీపై శిక్షణ: కంపెనీ లేదా సంస్థలో పనిచేసే ఉద్యోగులందరికీ సైబర్ సెక్యూరిటీ అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించాలి. దీనివల్ల సైబర్ దాడులు ఎలా జరుగుతాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అన్నది తెలుస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Apple iPhone : ఐఫోన్ స్లో అవుతోందా? ఈ ట్రిక్స్ ఫాలో అయితే ఫోన్ సూపర్ స్పీడ్‌లో పనిచేస్తుంది
Best Smartphones under Rs.10000: రూ.10 వేల లోపు లభించే బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

