Google chatbot Bard | టెక్ వరల్డ్‌లో చాట్‌బోట్ వేడి.. చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్ బార్డ్..!
Google chatbot Bard | ఓపెన్ ఏఐ చాట్ జీపీటీకి పోటీగా గూగుల్.. బార్డ్ చాట్ బోట్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
Google chatbot Bard | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో మూడు నెలల క్రితం.. పురుడు పోసుకున్న ఓపెన్ ఏఐ `చాట్‌బోట్` చాట్ జీపీటీ.. ఇప్పుడు టెక్నాలజీ వరల్డ్‌నే షేక్ చేస్తున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ ద్వారా ఇతర సంస్థలపై పైచేయి సాధించేందుకు టెక్ దిగ్గజాల మధ్య పోటీ పెరిగింది. ఇంతకు చాట్‌జీపీటీ చాట్‌బోట్ అంటే ఏమిటి.. దేశీయ, అంతర్జాతీయ.. శాస్త్రీయ, సాంకేతిక, అంతరిక్ష పరిశోధనల వరకు ప్రతి అంశంలోనూ ఇప్పటివరకు మనకు తెలియని విషయాలపై గూగులమ్మను అడిగే తెలుసుకునే వారం.. కానీ.. ఇప్పుడు గూగుల్‌కు పోటీగా వచ్చేసింది చాట్‌జీపీటీ.. క్షణాల్లో అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు అడిగిన సమాచారాన్ని యూజర్లకు అందుబాటులోకి తెస్తున్నది. తద్వారా గూగులమ్మ సెర్చింజన్ సేవలకే సవాల్ విసిరింది.
ఓపెన్ ఏఐలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులతో గూగుల్ అప్రమత్తం
ఇలా చాట్ జీపీటీ సేవలు వైరల్ కావడంతో ఆ టూల్ తీసుకొచ్చిన ఓపెన్ ఏఐలో మైక్రోసాఫ్ట్ అదనంగా 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. చాట్‌జీపీటీ సంచలనాలు.. దాని సంస్థ ఓపెన్ ఏఐలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెడుతుండటంతో గూగుల్ అప్రమత్తమైంది. `బార్డ్` అనే చాట్‌బోట్ తేనున్నట్లు ప్రకటించింది. గూగులమ్మతోపాటు చైనా సెర్చింజన్ బైడూ (Baidu) కూడా తమ యూజర్లకు మరో చాట్‌బోట్ `ఎర్నై` అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. తమ యూజర్ల ప్రశ్నలకు స్పందించేలా తమ సెర్చింజన్ సేవలను విస్తరించడానికి బార్డ్, ఎర్నై చాట్బోట్లను సమగ్రంగా అభివృద్ధి చేయ తలపెట్టాయి గూగుల్.. బైడూ.
సుందర్ పిచాయ్ బ్లాగ్‌లో బార్డ్ చాట్‌బోర్డ్ ప్రకటన
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మంగళవారం సొంతంగా `బార్డ్` చాట్‌బోట్`ను తీసుకొస్తున్నట్లు తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం తమకు విశ్వసనీయ యూజర్లకు అందుబాటులో ఉంచామని, ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉందని తెలిపారు. కొన్ని వారాల్లోనే సాధారణ ప్రజానీకానికి లభ్యం అవుతుందని పేర్కొన్నారు.
లామ్డా టూల్‌తో గూగుల్ చాట్‌బోట్ బార్డ్
`లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్ (Language Model for Dialogue Applications- LaMDA )` అనే టూల్ సాయంతో లైట్ వెయిట్ మోడల్ వర్షన్ చాట్‌బోట్ సేవలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. లెస్ కంప్యూటింగ్ పవర్‌తో చాట్‌బోట్‌కు మరింత ఫీడ్‌బ్యాక్ ఇచ్చేలా దీన్ని రూపొందిస్తున్నది. సంక్లిష్టమైన టాపిక్స్‌ను సరళతరం చేయడం గూగుల్ చాట్‌బోట్ `బార్డ్` లక్ష్యంగా కనిపిస్తున్నది. ఔటర్ స్పేస్ డిస్కవరీ కూడా చిన్నారులకు తేలిగ్గా అర్థమయ్యేలా ఈ చాట్‌బోట్ తన యూజర్లకు సమాచారం ఇవ్వనున్నది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

