Google Bard | బార్డ్‌ను నమ్మలేం : యూజర్లకు గూగుల్ యూకే బాస్ వార్నింగ్
ఓపెన్ఏఐ క్రియేషన్ చాట్‌జీపీటీకి దీటుగా ఏఐ టూల్ బార్డ్‌ను సెర్చింజన్ దిగ్గజం గూగుల్ (Google Bard) ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంఛ్ చేసింది.
న్యూయార్క్ : ఓపెన్ఏఐ క్రియేషన్ చాట్‌జీపీటీకి దీటుగా ఏఐ టూల్ బార్డ్‌ను సెర్చింజన్ దిగ్గజం గూగుల్ (Google Bard) ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంఛ్ చేసింది. ఈ చాట్‌బాట్ సెర్చికి ప్రత్యామ్నాయంగా, గూగుల్ సమాచారానికి నూతన మార్గంగా బార్డ్ చాట్‌బాట్ పురోగతి సాధిస్తుందని అందరూ భావించారు.
ఇంటరాక్టివ్ ఏఐ టూల్‌గా బార్డ్ ఇంకా చాలా మెరుగుపడాల్సిన పరిస్ధితి కాగా, బార్డ్ కొన్ని సార్లు తప్పుడు సమాధానాలు కూడా ఇస్తుందని స్వయంగా తన హోంపేజ్లోనే డిస్‌క్లెయిమర్ ఇచ్చారు. ఇక గూగుల్ యూకే బాస్ లేటెస్ట్గా బార్డ్‌ను నమ్మలేమని సంచలన వ్యాఖ్యలు చేశారు. బార్డ్ రిప్లయ్‌లను ట్రెడిషన్ గూగుల్ సెర్చి ఇంజన్‌తో ఒకసారి చెక్ చేసుకోవాలని బాంబు పేల్చారు.
కచ్చితమైన సమాచారం అందించే గూగుల్ సెర్చి ఇంజన్‌ను ఉపయోగించాలని తాము యూజర్లను ప్రోత్సహిస్తామని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గూగుల్ బ్రిటన్ ఎండీ డెబీ వీన్‌స్టీన్ స్పష్టం చేశారు. నిర్ధిష్ట సమాచారం కోరుకునే వారికి బార్డ్ సరైన వేదిక కాదని ఆమె తేల్చిచెప్పారు. బార్డ్ రెస్పాన్స్‌లు నమ్మదగినవి కావని ఇంతకుముందు పలువురు గూగుల్ ఉద్యోగులు సైతం పేర్కొన్నారు. బార్డ్ పోటీలో నిలిచేందుకు నాసిరకం నాణ్యతా ప్రమాణాలతో కూడిన సమాచారాన్ని చేరవేస్తుందని ఈ ఏడాది ఏప్రిల్‌లో 18 మంది ప్రస్తుత, మాజీ గూగుల్ ఉద్యోగులు పేర్కొన్నట్టు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది.
Read More :
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

