న్యూఢిల్లీ : ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌లో నథింగ్ ఫోన్ వన్, గూగుల్ పిక్సెల్ 6ఏ వంటి స్మార్ట్ఫోన్లపై ఈకామర్స్ దిగ్గజం హాట్ డీల్స్‌ను ప్రకటించింది. ప్రీమియం స్మార్ట్ఫోన్లు వివిధ బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ తర్వాత రూ 30,000 లోపు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.
ఇక సెప్టెంబర్ 23 నుంచి అమెజాన్ సైతం మెగా సేల్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. మరోవైపు రూ 43,999కి లాంఛ్ అయిన గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఏకంగా రూ 27,669కే లభిస్తోందని ఈకామర్స్ దిగ్గజం వెల్లడించింది. బిగ్ బిలియన్ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ కార్డు లావాదేవీలపై ఫ్లిప్‌కార్ట్ 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తుండగా, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ 20,000 ఆఫర్ చేస్తోంది.
అయితే కస్టమర్ల పాత ఫోన్ మోడల్, కండిషన్ ఆధారంగా ఎక్స్ఛేంజ్ విలువ ఆధారపడిఉంటుంది. ఇక గూగుల్ పిక్సెల్ 6ఏ ఫీచర్ల విషయానికి వస్తే ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్‌తో 6.1 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. పిక్సెల్ 6ఏ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4410ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది.