Google Pay | గూగుల్‌పే యాప్‌లో టెక్నికల్ లోపం.. యూజర్ల ఖాతాల్లోకి రూ.81 వేలు
Google Pay | గూగుల్‌పే యాప్‌లో సాంకేతిక లోపం వల్ల క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఓచర్లు స్క్రాచ్చేసిన అమెరికన్ యూజర్ల ఖాతాల్లో రూ.800 నుంచి రూ.81 వేల వరకు నగదు క్రెడిట్ అయ్యింది.
Google Pay | ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్‌దే హవా.క్షణాల్లో చెల్లింపులు జరిగిపోతాయి. ఇతరులకు నగదు బదిలీ కూడా కన్నుమూసి తెరిచేలోపు పూర్తవుతాయి. మొబైల్ యాప్ ఆధారిత పేమెంట్స్‌పై రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు వస్తాయి. గతంలో సెర్చింజన్ గూగుల్ అనుబంధ పేమెంట్ యాప్ గూగుల్ పేలో భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉండేవి. కానీ, ఇప్పుడు చాలా మందికి ‘బెటర్ లక్ నెక్ట్స్ టైం’ అనే మెసేజ్ వస్తోంది. అయితే, సాంకేతిక లోపం కారణంగా `మై రివార్డ్స్` విభాగంలో క్యాష్ బ్యాక్ ఆఫర్ల ఓచర్లు స్క్రాచ్ చేసిన యూజర్ల ఖాతాల్లోకి రూ.81 వేల చొప్పున క్రెడిట్ అయ్యాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఘటన చోటు చేసుకున్నది.
గూగుల్‌పేలో లోపం వల్ల అమెరికాలోని పిక్సెల్ ఫోన్ యూజర్లకు భారీగా క్యాష్‌బ్యాక్‌లు వచ్చాయి. 10 డాలర్ల నుంచి 1000 డాలర్ల వరకు క్యాష్ క్రెడిట్ కావడంతో కొందరు నెటిజన్లు రెడిట్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో పోస్టులు పెట్టారు. ఒకవ్యక్తి 16 లావాదేవీల్లో 10 ట్రాన్సాక్షన్స్‌కు క్యాష్‌బ్యాక్ వచ్చిందని పేర్కొన్నాడు. కొందరు తమకు 100 డాలర్లు వచ్చాయంటే.. ఒక యూజర్ తనకు 240 డాలర్లు క్యాష్‌బ్యాక్ అయ్యాయని, మరో యూజర్ ఏకంగా 1072 డాలర్లు వచ్చాయని పోస్ట్ పెట్టాడు. మన కరెన్సీలో రూ.800 నుంచి రూ.80 వేల పైమాటే మరి. దీంతో పలువురు నెటిజన్లు తమ సంతోషాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు.
ఈ సంగతి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు గూగుల్ పే ఖాతాదారులు తమ లక్ చెక్ చేసుకున్నారు. వెంటనే గూగుల్ అలర్టయింది. తన గూగుల్‌పే యాప్‌లో లోపాన్ని సరి చేసింది. యాప్‌లో టెక్నికల్ మార్పులు చేస్తున్నప్పుడు ఈ లావాదేవీలు జరిగినట్లు సమాచారం. గూగుల్ పే తన ఖాతాదారుల నుంచి క్యాష్‌బ్యాక్ డబ్బు వెనక్కు తీసేసుకున్నట్లు తెలుస్తున్నది. నిధులు ఇతరులకు బదిలీ చేసిన వారి విషయంలో ఏం చేయలేదని సమాచారం. ఇండియాలో యూపీఐ రూపంలో గూగుల్.. జీ-పే సేవలందిస్తున్నది. అమెరికాలో వ్యాలెట్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

