గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా? ఈ వార్త మీ కోసమే..!
Google Chrome | మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను వాడుతున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే.. వీలైనంత మేరకు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కొత్త వెర్షన్‌ను అప్డేట్ చేసుకోండి. లేకుంటే ఇబ్బందులుపడక తప్పదు. క్రోమ్ బ్రౌజర్ (వర్షన్ 105.0.5195.102)లో కొత్త బగ్‌ను గూగుల్‌ను గుర్తించింది. ఈ మేరకు వినియోగదారులకు అలెర్ట్‌ను జారీ చేసింది. బగ్ సమస్య నుంచి బయటపడేందుకు కొత్తగా అప్డేట్ను విడుదల చేసింది. విండోస్, మ్యాక్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో గూగుల్ క్రోమ్ వినియోగదారుల కోసం సెక్యూరిటీ ప్యాచ్‌ను విడుదల చేసినట్లు తెలిపింది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించింది. హ్యాకింగ్ ముప్పును నివారించడానికి క్రోమ్‌ను త్వరగా అప్డేట్ చేసుకోవాలని వినియోగదారులకు గూగుల్ సూచించింది.
CVE-2022-3075 బగ్ బ్రౌజర్లో గుర్తించగా.. గూగుల్ క్రోమ్ వెర్షన్ 105ను ఆగస్టు 30న విడుదల చేసిన కొన్ని రోజులకే తాజా అప్డేట్ను ఇచ్చింది. సెక్యూరిటీ బగ్‌లు చేరకుండా నిరోధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఇతర ప్రాజెక్టులపై ఆధారపడి థర్డ్ పార్టీ లైబ్రరీలో బగ్ ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండాలని, అలాంటి చర్యలు చేపడుతామని పేర్కొంది. Google Chrome బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోవడం తేలికేనని.. ఇందులో ఎలాంటి సమస్యలుండవని గూగుల్ పేర్కొంది. ‘గూగుల్ బ్రౌజర్‌ను ఓపెన్ చేసిన తర్వాత ఎడమ వైపు పైనున్న మూడుచుక్కలపై క్లిక్ చేయాలి. తర్వాత సెట్టింగ్స్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఎబౌట్ గూగుల్ క్రోమ్‌పై క్లిక్ చేస్తే అప్డేట్ అవుతుంది’ అని తెలిపింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health | మానసిక లేదా శారీరక క్షోభను ఒక తరం అనుభవిస్తే అది భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపిస్తుందా..?
Harish Rao | కేసీఆర్ పాలనలో వలసలు తిరుగుముఖం.. రేవంత్ పాలనలో ఎడ్లబండ్లపై బలవంతపు వలసలు..!
‘లెక్చరర్ గోపాలకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి’
Nani | నాని కెరీర్లో కీలక నిర్ణయం.. ఇకపై అలాంటి సినిమాలకు దూరం..!
Man Kills Girlfriend | అనుమానంతో ప్రియురాలిని లాడ్జిలో హత్య చేసిన ప్రియుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

