e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home News మెరుపు వేగంతో భూమి వైపు దూసుకొస్తున్న భారీ ఆస్ట‌రాయిడ్‌

మెరుపు వేగంతో భూమి వైపు దూసుకొస్తున్న భారీ ఆస్ట‌రాయిడ్‌

మెరుపు వేగంతో భూమి వైపు దూసుకొస్తున్న భారీ ఆస్ట‌రాయిడ్‌

వాషింగ్ట‌న్‌: ఓ భారీ ఆస్ట‌రాయిడ్ భూమి వైపు మెరుపు వేగంతో దూసుకొస్తోంది. ఇది ఈ నెల 24న భూమిని దాటి వెళ్లిపోనున్న‌ట్లు అమెరిక‌న్ స్పేస్ ఏజెన్సీ నాసా వెల్ల‌డించింది. ఈ ఆస్ట‌రాయిడ్ను 2008 గో20గా పిలుస్తున్నారు. ఇది ఓ స్టేడియం ప‌రిమాణం లేదా తాజ్‌మ‌హ‌ల్ కంటే మూడు రెట్లు పెద్ద‌గా ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. గంట‌ల‌కు 18 వేల మైళ్ల వేగంతో అంటే సెక‌ను 8 కిలోమీట‌ర్ల వేగంతో ఇది భూమి వైపు దూసుకొస్తున్న‌ట్లు నాసా చెప్పింది. ఈ స్పీడు కార‌ణంగా ఆస్ట‌రాయిడ్‌కు అడ్డుగా వ‌చ్చే ఏదైనా ధ్వంస‌మైపోతుంద‌ని స్పేస్ ఏజెన్సీ తెలిపింది.

ఈ ఆస్ట‌రాయిడ్ వ్యాసం 220 మీట‌ర్లుగా ఉంది. ఇది భూమికి 28 ల‌క్ష‌ల‌ కిలోమీట‌ర్ల దూరం నుంచి వెళ్ల‌నుంది. అంటే ఇది భూమి, చంద్రుడికి మ‌ధ్య ఉన్న దూరం కంటే ఎనిమిది రెట్లు. అయితే ఈ ఆస్ట‌రాయిడ్ సుర‌క్షితంగా భూమిని దాటి వెళ్లిపోతుంద‌ని నాసా తెలిపింది. అయితే ఈ ఆస్ట‌రాయిడ్ క‌క్ష్య‌ను అపోలోగా వ‌ర్గీక‌రించారు. ఈ కేట‌గిరీ ఆస్టరాయిడ్లు చాలా ప్ర‌మాద‌క‌రం. దీంతో ఈ ఆస్ట‌రాయిడ్ క‌ద‌లిక‌ల‌ను నాసా చాలా జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తోంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మెరుపు వేగంతో భూమి వైపు దూసుకొస్తున్న భారీ ఆస్ట‌రాయిడ్‌
మెరుపు వేగంతో భూమి వైపు దూసుకొస్తున్న భారీ ఆస్ట‌రాయిడ్‌
మెరుపు వేగంతో భూమి వైపు దూసుకొస్తున్న భారీ ఆస్ట‌రాయిడ్‌

ట్రెండింగ్‌

Advertisement