whatsapp hacks |వాట్సాప్ హ్యాక్సాప్గా మారుతున్నది. ఒక్కరిది హ్యాక్ అయ్యిందంటే ఆ ఫోన్లో ఉండే వాట్సాప్ కాంటాక్టులు అన్ని హ్యాకర్ల చేతిలోకి వెళ్తున్నాయి. నయా పంథాలో సైబర్‌నేరగాళ్లు హ్యాకింగ్‌కు పాల్పడుతూ.. హ్యాక్ చేసిన ఫోన్ నంబర్లను మరోసారి వాడకుండా రెండంచెల భద్రతను ఏర్పాటు చేసుకుంటున్నారు. నైజీరియన్ సైబర్నేరగాళ్లే ఈ హ్యాకింగ్‌కు పాల్పడుతున్నట్లు సైబర్ పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా ఫోన్ నంబర్లను సేకరించే నేరగాళ్లు ఈ హ్యాకింగ్ ఘటనలకు పాల్పడుతున్నారు.
వాట్సాప్‌ను హ్యాక్ చేసిన సైబర్‌నేరగాళ్లు తమ తల్లికి ఆరోగ్యం బాగలేదంటూ మేసేజ్‌లు పంపించారు. సహాయం చేసే వాళ్లు పలాన ఖాతాకు డబ్బులు డిపాజిట్ చేయాలని కోరారు. ఆ మేసేజ్‌లు చూసిన టోలిచౌకికి చెందిన ఇద్దరు వ్యక్తులు తన స్నేహితుడు ఆపదలో ఉన్నాడని రూ.3 లక్షలు వేర్వేరుగా బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేశారు. మరుసటి రోజు ఫోన్ చేసి మీ అమ్మకు ఎలా ఉందని అడిగారు. ఫోన్ రీసివ్ చేసుకున్న వ్యక్తి అశ్చర్యపోయాడు. అదంతా మోసమని చెప్పడంతో బాధితులిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో లక్ష రూపాయలు సైబర్‌నేరగాళ్లు కాజేశారు. ఇదిలా ఉండగా వీఎస్టీ కంపెనీ ఎండీ పేరుతో తనకు అత్యవసరంగా డబ్బులు కావాలంటూ అందులో పనిచేసే ఉద్యోగులకు సమాచారం వెళ్లింది. అప్రమత్తమైన సిబ్బంది విషయాన్ని తమ ఎండీ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వాట్సాప్‌లో రెండంచెల ధ్రువీకరణ పెట్టుకోవడం సురక్షితం. సైబర్‌నేరగాళ్లు ముందుగా ఎవరో ఒకరు అమాయకుల నంబర్‌ను యాక్టివేట్ చేసుకొని, వాళ్ల ఓటీపీతో వాట్సాప్‌ను యాక్టివేట్ చేస్తారు. ఇలా అందులోని ఫోన్ నంబర్లతో, మరిన్ని కాంటాక్టులకు లింక్‌లు పంపి వాట్సాప్‌లను యాక్టివేట్ చేస్తుంటారు. వీఐపీల పేరు, వారి డీపీలతో డబ్బులు కావాలని ఇతరాత్ర పనుల కోసం మేసేజ్ పంపిస్తుంటారు. కొందరు నిజమని నమ్మి డబ్బు వేస్తుంటారు. అయితే హ్యాక్ అయిన వాట్సాప్‌లలో విలువైన సమాచారం ఉంటే దాని వల్ల కూడా బాధితులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. వాట్సాప్ సెట్టింగ్‌లో, అకౌంట్ అని ఉంటుంది. అందులో డబుల్ వెరిఫికేషన్ అని ఉంటుంది. దాన్ని ఎనేబుల్డ్ చేసుకుంటే, వాట్సాప్‌ను నేరగాళ్ల్లకు హ్యాకింగ్ చేయడం సాధ్యం కాదు.
– కేవీఎం ప్రసాద్, ఏసీపీ, హైదరాబాద్ సైబర్‌క్రైమ్స్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
గూగుల్‌లో వీటిని అసలు సెర్చ్ చేయకూడదు!
గూగుల్‌లో ఫేక్ ఫోటోలను ఎలా గుర్తించాలి…?
నకిలీ ఫేస్బుక్ ఖాతాలతో మోసాలు.. మిమ్మల్ని డబ్బులు అడిగేది మీ ఫ్రెండేనా కాదా ఇలా గుర్తించండి
Cyber fraud helpline number|24 గంటల్లోపు ఈ నంబర్‌కు కాల్ చేస్తే పోయిన డబ్బులు వచ్చేస్తాయి
whatsapp hacks |