Flipkart | నేటితో ముగియనున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్..ఐఫోన్లపై హాట్ డీల్స్!
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ శుక్రవారం రాత్రితో ముగియడంతో కస్టమర్లు మరికొద్ది గంటల వరకూ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయ సేల్ డీల్స్‌ను పొందుతారు.
న్యూఢిల్లీ : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ శుక్రవారం రాత్రితో ముగియడంతో కస్టమర్లు మరికొద్ది గంటల వరకూ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయ సేల్ డీల్స్‌ను పొందుతారు. యాపిల్ ప్రీమియం ఐఫోన్ 13 ఆఫర్లతో కలిపి కేవలం రూ 48,000కే లభిస్తుండటంతో ఈ ఏడాది ఫ్లిప్‌కార్ట్ సేల్‌పై ఆసక్తి నెలకొంది. డిమాండ్ అధికంగా ఉండటంతో ధరలు వేగంగా పైకి ఎగబాకాయి. కొన్ని సార్లు ఈ స్మార్ట్‌ఫోన్ అవుటాఫ్ స్టాక్ చూపించింది. ఇక ఐఫోన్ 13, ఐఫోన్ 12 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో తాత్కాలిక తగ్గింపు ధరకు అందుబాటులో ఉండటంతో కస్టమర్లు వాటిని కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు.
లాస్ట్ మినిట్ డీల్స్‌లో ఐఫోన్ 13, ఐఫోన్ 12ను సొంతం చేసుకునేందుకు ఇదే చివరి అవకాశంగా కస్టమర్లు సేల్‌లో పాలుపంచుకుంటున్నారు. ఐఫోన్ 13 బేస్ 128జీబీ మోడల్ ప్రస్తుతం రూ 58,990కి రిటైల్ ధరగా ఉండగా రెడ్, బ్లూ, గ్రీన్, బ్లాక్ కలర్స్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లతో పాటు రూ 16,900 విలువైన ఎక్స్ఛేంజ్ డీల్‌ను పొందే వెసులుబాటు ఉంది. ఇక 256జీబీ, 512జీబీ వేరియంట్లు వరుసగా రూ 67,990 రూ 86,990కు లభిస్తున్నాయి.
ఐఫోన్ 14లో పెద్దగా అప్‌గ్రేడ్స్ లేకపోవడంతో అందుబాటు ధరలో ఐఫోన్ 13ను సొంతం చేసుకునేందుకు ఇదే అనువైన అవకాశంగా భావిస్తున్నారు. ఇక ఐఫోన్ 12పైనా డిస్కౌంట్లు, పలు ఆఫర్లు ఉన్నప్పటికీ ధర దాదాపు ఐఫోన్ 13కు దగ్గరగా ఉండటంతో ఐఫోన్ 13 కొనుగోలుకు కస్టమర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఐఫోన్ 12తో పోలిస్తే మెరుగైన బ్యాటరీ, కెమెరా సామర్ధ్యం ఉన్న ఐఫోన్ 13ను సొంతం చేసుకునేందుకు కస్టమర్లు మొగ్గుచూపుతున్నారు. ఇక ఐఫోన్ 12 64జీబీ మోడల్ రూ 53,990కి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఉంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

