ChatGPT | ఫేక్ చాట్‌జీపీటీ యాప్స్‌తో రూ. కోట్లు దండుకుంటున్న స్కామర్లు
జనరేటివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీకి (ChatGPT) విశేష ఆదరణ లభించడంతో ఈ క్రేజ్‌ను సొమ్ము చేసుకునేందుకు కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు.
న్యూయార్క్ : జనరేటివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీకి (ChatGPT) విశేష ఆదరణ లభించడంతో ఈ క్రేజ్‌ను సొమ్ము చేసుకునేందుకు కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. నకిలీ చాట్‌జీపీటీ యాప్‌ను క్రియేట్ చేసి కోట్లు కొల్లగొడుతున్నారు. చాట్‌జీపీటీ యాప్‌గా పొరబడుతూ ఎవరైనా నకిలీ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుంటే వెంటనే అన్ఇన్స్టాల్ చేసుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఐఓఎస్ యూజర్లకు చాట్‌జీపీటీ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని ఓపెన్ఏఐ ఈరోజు వెల్లడించగా త్వరలో అండ్రాయిడ్ యూజర్లు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేందుకు అనుమతిస్తామని పేర్కొంది.
దీంతో ఇప్పటివరకూ చాట్‌జీపీటీ యాప్‌లుగా చలామణిలో ఉన్న యాప్‌లన్నీ నకిలీవేనని స్పష్టమైంది. యూజర్లను మోసగించే ఉద్దేశంతోనే స్కామర్లు ఫేక్ చాట్‌జీపీటీ యాప్‌లను తెరపైకి తెచ్చారు. స్కామర్లు వేలాది ఫేక్ చాట్‌జీపీటీ యాప్స్‌ను క్రియేట్ చేసి యూజర్ల వద్ద వేలాది డాలర్లు కొల్లగొడుతున్నారని ఓ సైబర్ సెక్యూరిటీ వెబ్సైట్ వెల్లడించింది. కొన్ని యాప్స్ ప్రజలను మోసం చేస్తూ అధిక చార్జీలతో అందినంత దండుకుంటున్నాయని లేటెస్ట్ రిపోర్ట్ పేర్కొంది.
గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్స్‌లో పలు యాప్స్ చాట్‌జీపీటీని పోలిన విధంగా ఉన్నాయని, ఇవన్నీ నకిలీ యాప్స్ అని సైబర్ సెక్యూరిటీ కంపెనీ సోఫోస్ గుర్తించింది. వీటిని ప్రజలు సరిగ్గా గుర్తించకుండానే ఖరీదైన ప్లాన్స్‌తో సబ్‌స్క్రైబ్ చేసుకునేలా అవి ఆకట్టుకునే ప్రకటనలు గుప్పిస్తున్నాయని పేర్కొంది. ఏఐ, చాట్‌బాట్స్‌కు ప్రస్తుతం నెలకొన్న క్రేజ్‌తో చాట్‌జీపీటీని పోలిన యాప్స్‌ను యూజర్లు యాపిల్ యాప్, గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మోసపోతున్నారని సోఫోన్ ప్రిన్సిపల్ థ్రెట్ రీసెర్చర్ సీన్ గలగర్ వ్యాఖ్యానించారు. వ్యూహాత్మక ప్రకటనల ఎత్తుగడతో ఫేక్ యాప్స్ యూజర్లను ఆకట్టుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Read More
ChatGPT app | ఐఫోన్లలో అందుబాటులోకి వచ్చిన చాట్‌జీపీటీ యాప్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
woman kills twin sons | ప్రియుడు అంగీకరించలేదని.. కవల కుమారులను చంపిన మహిళ
కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య
MLC Botsa | ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స
Delhi-NCR | ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. గ్రాప్-1 ఆంక్షలు అమలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

