న్యూయార్క్ : ఓపెన్ఏఐ క్రియేట్ చేసిన చాట్‌జీపీటీ (ChatGPT app) ఎట్టకేలకు యాప్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ యాప్ ఐఫోన్లకే పరిమితం కాగా త్వరలో అండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకూ చాట్‌జీపీటీ యాప్ అందుబాటులోకి రానుంది. ముందుగా అమెరికాలో ఐఫోన్ యూజర్లకు ఈ యాప్‌ను యాక్సెస్ చేసుకుంటారని ఆపై ఇతర దేశాల ఐఫోన్ యూజర్లకూ అందుబాటులోకి వస్తుందని కంపెనీ పేర్కొంది. ఇక ఐఓఎస్ కోసం చాట్‌జీపీటీ వాయిస్ ఇన్‌పుట్స్‌ను కూడా అనుమతిస్తుంది.
ప్లస్ మెంబర్షిప్ కలిగిన యూజర్లు మెరుగైన, వేగవంతమైన సేవలు పొందుతారు. ఇప్పటివరకూ అండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ఫోన్లలో లభిస్తున్నా క్రోమ్ లేదా సఫారీ వంటి బ్రౌజర్ ద్వారా లభిస్తోంది. ప్రస్తుతం ఐఫోన్ యూజర్లు యాపిల్ యాప్ స్టోర్ నుంచి నేరుగా డెడికేటెడ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్రాయిడ్ యూజర్లు ఈ యాప్ సిద్ధం కాగానే గూగుల్ ప్లే నుంచి యాప్‌ను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.
ముందుగా అమెరికాలో తాము చాట్‌జీపీటీ యాప్ సేవలను ప్రవేశపెడుతున్నామని, రాబోయే వారాల్లో ఇతర దేశాల్లో అందుబాటులోకి తీసుకువస్తామని యూజర్ ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా చాట్‌జీపీటీ ఫీచర్లు, భద్రతా ప్రమాణాలను మెరుగుపరుస్తామని కంపెనీ పేర్కొంది. తమ యాప్ ఇన్స్టంట్ సమాధానాలు, సలహాలు, క్రియేటివ్ ఇన్స్పిరేషన్, వృత్తిగత సమాచారం, వ్యక్తిగత బోధన వంటి ఫీచర్లను ఆఫర్ చేస్తుందని చాట్‌జీపీటీ యాప్ స్టోర్ లిస్టింగ్‌లో పేర్కొంది.
Read More