Facebook : ఇక నుంచి ఫేస్బుక్ యాప్ నుంచే వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు
అదేంటి.. ఫేస్బుక్లో ఎప్పటి నుంచో వాయిస్, వీడియో కాలింగ్ ఆప్షన్ ఉంది కదా అంటారా? అవును.. ఉంది కానీ.. దాని కోసం సపరేట్గా ఫేస్బుక్ మెసెంజర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే.. అప్పుడు దాంట్లో చాటింగ్, వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ ఆప్షన్ ఉంటుంది.

కానీ.. ఇక నుంచి సపరేట్గా మెసెంజర్ యాప్ లేకుండానే.. ఫేస్బుక్ మెయిన్ యాప్‌లోనే వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఫేస్బుక్.. ఇన్‌స్టాగ్రామ్‌తో మెసెంజర్‌ను లింక్ చేసింది. దీంతో ఫేస్బుక్ మెసెంజర్ నుంచి కూడా ఇన్స్టాగ్రామ్ కాంటాక్ట్స్‌ను ఇంపోర్ట్ చేసుకొని.. చాట్ చేసుకునే వెసులుబాటు ఉంది. దాని కోసం సపరేట్గా ఇన్స్టాగ్రామ్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
అలాగే.. ఇప్పుడు ఫేస్బుక్, మెసెంజర్ రెండు యాప్స్‌ను ఇంటిగ్రేట్ చేసే పనిలో ఉంది ఫేస్బుక్. త్వరలోనే దానికి సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.
దానితో పాటు.. వాట్సప్‌ను కూడా ఫేస్బుక్ మెయిన్ యాప్‌తో ఇంటిగ్రేట్ చేసే యోచనలో ఫేస్బుక్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. మెసెంజర్‌కు సంబంధించిన అన్ని ఫీచర్స్ కావాలంటే మాత్రం.. ఖచ్చితంగా మెసెంజర్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాల్సిందేనని ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

