ఈ డివైజ్ మీ బెడ్రూంలో సంభాషణలూ వింటోందట..!
ముఖ్యంగా ‘అలెక్సా’ ఎన్నో కుటుంబాల్లో భాగమైపోయింది. కూర్చున్న చోటు నుంచే ఇంట్లోని వివిధ పరికరాలను ఆన్, ఆఫ్ చేయడానికి, గూగుల్‌ను ప్రశ్నలు అడిగి జవాబులు తెలుసుకోవడానికి, పాటలు వినడానికి.. ఇలా ఎన్నో పనులకు ఈ బుల్లి పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ పరికరాన్ని ఉపయోగించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
Alexa | ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ మయమైపోయింది. ప్రజలు డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ డివైజ్‌లపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అమెజాన్ అలెక్సా, అమెజాన్ ఏకో, గూగుల్ హోమ్ వంటివి ఇప్పటికే చాలా పాపులర్ అయ్యాయి.
ముఖ్యంగా ‘అలెక్సా’ ఎన్నో కుటుంబాల్లో భాగమైపోయింది. కూర్చున్న చోటు నుంచే ఇంట్లోని వివిధ పరికరాలను ఆన్, ఆఫ్ చేయడానికి, గూగుల్‌ను ప్రశ్నలు అడిగి జవాబులు తెలుసుకోవడానికి, పాటలు వినడానికి.. ఇలా ఎన్నో పనులకు ఈ బుల్లి పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ పరికరాన్ని ఉపయోగించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా ఈ పరికరాన్ని బెడ్రూమ్లో అస్సలు ఉంచుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. మీరు మాట్లాడుకునేదంతా ఈ పరికరం రికార్డు చేస్తోందట. ఆ డాటాను అమెజాన్ ఉద్యోగులు కొంతమంది వింటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగా మీ వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగినట్లే అని చెప్తున్నారు. అందుకే ఈ పరికరాన్ని కిచెన్, హాల్ వంటి ప్రదేశాల్లో పెట్టుకోవాలని సలహా ఇస్తున్నారు.
అమెజాన్ కంపెనీ కూడా ఈ విషయం నిజమేనని అంగీకరించింది. అయితే, అలెక్సాను మరింత మెరుగుపరచడం కోసం, రీసెర్చ్‌లో భాగంగానే ఈ పని చేస్తున్నామని చెప్పింది. ఈమేరకు ఫాక్స్ న్యూస్ ఈ వివరాలను వెల్లడించింది. మీ ఇంట్లోనూ ‘అలెక్సా’ను వినియోగిస్తున్నారా..? పై జాగ్రత్తలు పాటించండి. లేదంటే మీ వ్యక్తిగత ప్రైవసీని ఆన్లైన్లో పెట్టినట్లే.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

