AI startup | ఈ ఏఐ స్టార్టప్‌తో సెలబ్రిటీలతో మాట్లాడే వెసులుబాటు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై గత ఏడాది కాలంగా టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది. ఈ రంగంలో టెక్ దిగ్గజాలతో పాటు స్టార్టప్‌లు, (AI startup) మధ్యశ్రేణి కంపెనీలు పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి.
న్యూయార్క్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై గత ఏడాది కాలంగా టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది. ఈ రంగంలో టెక్ దిగ్గజాలతో పాటు స్టార్టప్‌లు, (AI startup) మధ్యశ్రేణి కంపెనీలు పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ నుంచి బెయిన్ అండ్ కో వరకూ పలు రంగాలకు చెందిన కంపెనీలు ఏఐ పట్ల ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇక సెర్చింజన్ దిగ్గజం మరో ఏఐ కంపెనీలో కోట్లది డాలర్లు వెచ్చించేందుకు కసరత్తు సాగిస్తోంది.
ఇద్దరు గూగుల్ మాజీ ఉద్యోగులు అభివృద్ధి చేసిన ఏఐ స్టార్టప్‌లో టెక్ దిగ్గజం భారీ పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్ధమవుతోంది. గూగుల్ మాజీ ఉద్యోగులు నోమ్ షజీర్, డేనియల్ డి ఫ్రిటాస్ డెవలప్ చేసిన ఏఐ చాట్‌బాట్ స్టార్టప్ క్యారెక్టర్లో గూగుల్ పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ కంపెనీతో ఇప్పటికే గూగుల్ భాగస్వామ్యం ఉండగా భారీ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో భాగస్వామ్యం మరింత బలపడనుందని సమాచారం.
క్యారెక్టర్ చాట్ బాట్ ద్వారా యూజర్లు సెలబ్రిటీల వర్చువల్ వెర్షన్స్‌తో మాట్లాడే వెసులుబాటు కలుగుతుంది. దీని ద్వారా యూజర్లు తమ సొంత చాట్‌బాట్స్, ఏఐ అసిస్టెంట్లను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ చాట్‌బాట్ ఫ్రీ, ప్రీమియం వెర్షన్లు కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు సాగిస్తున్నారు. ఈ ఏఐ స్టార్టప్ ద్వారా యూజర్లు సెలబ్రిటీలతో సులభంగా కనెక్ట్ అయ్యే వెసులుబాటు కలుగుతుంది.
Read More :
SUV Hits 3 Bikes | ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురికి గాయాలు.. VIDEO
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

