Elon Musk-ChatGPT | చాట్‌జీపీటీ తరహా ఏఐ చాట్‌బోట్ పోటీలో ఎలన్‌మస్క్ కూడా!
Elon Musk-ChatGPT | ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కూడా సొంతంగా చాట్ జీపీటీ తరహా చాట్ బోట్ డెవలప్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
Elon Musk-ChatGPT | ఇప్పుడు టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో పని చేస్తున్న చాట్‌జీపీటీ చాట్‌బోట్ హల్చల్ అంతా ఇంతా కాదు. గతేడాది నవంబర్‌లో చాట్‌జీపీటీ చాట్‌బోట్‌ను అందుబాటులోకి తెచ్చిన స్టార్టప్ `ఓపెన్ ఏఐ`లో మైక్రోసాఫ్ట్ భారీగా పెట్టుబడులు పెట్టడంతో టెక్ దిగ్గజాల మధ్య పోటీ పెరిగింది. గూగుల్ సొంతంగా బార్డ్.. చైనా బైదూ.. ఎర్నీ తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి. ఓపెన్ ఏఐలో పెట్టుబడులు పెట్టిన ప్రపంచ కుబేరుడు ఎలన్‌మస్క్ సొంతంగా చాట్‌జీపీటీ తరహా ఏఐ చాట్‌బోట్‌ను డెవలప్ చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం గూగుల్ అల్ఫాబెట్ డీప్‌మైండ్ రీసెర్చ్ టీం మాజీ ఉద్యోగి ఇగోర్ బాబుస్కిన్ను నియమించుకున్టన్లు తెలిసింది. ఇగోర్ బాబుస్కిన్ సారధ్యంలో ఏఐ చాట్‌బోట్ తయారు చేయడానికి ల్యాబోరేటరీ ఏర్పాటు చేస్తారని సమాచారం.
నిపుణుల రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ టెక్నిక్లతోపాటు పర్యవేక్షణ ద్వారా రూపుదిద్దుకున్న లాంగ్వేజ్ మోడల్ చాట్‌జీపీటీ చాట్. తొలుత ఇన్నోవేషన్‌కు ప్రాధాన్యం ఇచ్చే ఎలన్‌మస్క్ `చాట్‌జీపీటీ చాలా మంచిది, మేం శక్తిమంతమైన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నుంచి దూరం కాలేం` అని ట్వీట్ చేశారు. వివిధ కారణాల రీత్యా తర్వాత చాట్‌జీపీటీని ఆయన విమర్శించారు.

చాట్‌జీపీటీ చాట్‌బోట్ సేవలకు సురక్షిత వ్యవస్థలను ఏర్పాటు చేయకపోవడంపై ఓపెన్ ఏఐ తీరును ఎలన్‌మస్క్ బహిరంగంగానే ఖండించారు. యూజర్ల మనోభావాలు దెబ్బతినేలా సమాచారం వెలువరించకుండా చాట్‌జీపీటీని నియంత్రించేందుకు సురక్షిత వ్యవస్థను ఇన్స్టాల్ చేయాలని స్పష్టం చేశారు. 2015లో ఏర్పాటైన ఓపెన్ ఏఐ స్టార్టప్ కో-ఫౌండర్లలో ఎలన్‌మస్క్ ఒకరు. కానీ, తర్వాత ఆ స్టార్టప్‌తో తెగదెంపులు చేసుకున్నారు. `ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై శిక్షణకు ఓపెన్ ఏఐ టెక్నాలజీ ఒక మేలుకొలుపు` అని అని అభివర్ణించారు.
ఓపెన్ ఏఐ ఎంతో కాలం నిలబడలేదని, అత్యధిక వాటాలు గల మైక్రోసాఫ్ట్‌కే లాభం అని ఇటీవల ఎలన్‌మస్క్ వ్యాఖ్యానించారు. తదుపరి దశలో ఏఐ+మానవ నిపుణుల మధ్యే పోటీ ఉంటుందని, నిపుణుల పాత్ర తగ్గుతుందని పేర్కొన్నారు. ఎలన్మస్క్తోపాటు పలు ఇతర కంపెనీలు కూడా చాట్‌జీపీటీ తరహా ఏఐ చాట్బోట్ల తయారీలో నిమగ్నమయ్యాయి. అమెరికా మల్టీ మీడియా ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ అండ్ సర్వీస్ `స్నాప్‌చాట్` కూడా నూతన ఏఐ చాట్‌బోట్‌ను ఆవిష్కరించింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

