Elon Musk | ఏఐ రెండువైపులా పదునున్న కత్తి..న్యూ టెక్నాలజీ నియంత్రణకు రిఫరీ అవసరం : ఎలన్ మస్క్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై నియంత్రణ ఉండాలని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సహా పలువురు టెక్ సీఈవోలు పిలుపుఇచ్చారు. ఏఐ కట్టడి కోసం టెక్ దిగ్గజాలు గొంతెత్తగా తాజాగా టెస్లా సీఈవో ఎలన్ మస్క్ (Elon Musk) వీరితో జత కలిశారు.
న్యూయార్క్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై నియంత్రణ ఉండాలని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సహా పలువురు టెక్ సీఈవోలు పిలుపుఇచ్చారు. ఏఐ కట్టడి కోసం టెక్ దిగ్గజాలు గొంతెత్తగా తాజాగా టెస్లా సీఈవో ఎలన్ మస్క్ (Elon Musk) వీరితో జత కలిశారు. ఏఐ ఇరువైపులా పదునైన కత్తి వంటిదని, దీన్ని సురక్షితంగా వాడేందుకు ఏఐపై నియంత్రణ ఉండాలని ట్విట్టర్ అధిపతి మస్క్ సూచించారు. ఏఐని స్పోర్ట్స్‌తో పోలుస్తూ మనకు ఓ రిఫరీ ఉండటం కీలకమని పేర్కొన్నారు.
ఆవిష్కరణ, భద్రతలకు మద్దతు ఇచ్చేలా అమెరికన్ కాంగ్రెస్ ఏఐపై అడుగులు వేయాలని అన్నారు. ఇది ఎదుగుతున్న టెక్నాలజీ అన్న మస్క్ దీన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. కంపెనీలు తీసుకునే చర్యలు సురక్షితంగా, సాధారణ ప్రజల ప్రయోజనాలను కాపాడేలా ఉండేలా రెగ్యులేటర్ వ్యవహరిస్తుందని మీడియాతో మాట్లాడుతూ మస్క్ వ్యాఖ్యానించారు.
కాగా, ఏఐ నియంత్రణ కోసం పట్టుబడుతున్న టెక్ దిగ్గజ సీఈవోలు క్యాపిటల్ హిల్‌లో చట్టసభ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎలన్ మస్క్‌తో పాటు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, ఎన్విడియా సీఈవో జెన్సెన్ హుంగ్, మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల, ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్ గేట్స్, ఎఎఫ్ఎల్-సీఐఓ లేబర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లిజ్ షులర్ తదితరులు పాల్గొన్నారు.
Read More :
Sanatan Dharma: సనాతన ధర్మాన్ని ఇండియా కూటమి అంతం చేయాలనుకుంటోంది: ప్రధాని మోదీ
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- AI
- Elon Musk
- Regulation
RELATED ARTICLES
తాజా వార్తలు
ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులా? కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ: నాగరాజు గుర్రాల
Jithu Madhavan | టాలీవుడ్లోకి ‘సీన్’ డైరెక్టర్ ఎంట్రీ.. మైత్రీ మూవీ మేకర్స్‌తో భారీ ప్రాజెక్ట్, హీరో ఎవరంటే?
Dads Little Friend | ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ మూవీ రివ్యూ.. కంటతడి పెట్టించే ఫీల్‌గుడ్ ఫ్యామిలీ డ్రామా!
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ రివ్యూ.. నేటి తరం ప్రేమ, పెళ్లి ఆలోచనలకు అద్దం పట్టే చిత్రం ఎలా ఉందంటే?
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినిమాను వదులుకోవడానికి అసలు కారణం ఇదే.. పదేళ్ల తర్వాత నిజం చెప్పిన దర్శకుడు సంపత్ నంది!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

