మెటా, ట్విట్టర్ బాటలో డిస్నీ : లేఆఫ్స్ బాంబు పేల్చిన స్ట్రీమింగ్ దిగ్గజం
ట్విట్టర్, మెటా తర్వాత తాజాగా స్ట్రీమింగ్ దిగ్గజం డిస్నీ లేఆఫ్స్, నియామకల నిలిపివేత దిశగా పయనిస్తున్నట్టు వెల్లడైంది.
న్యూయార్క్ : ట్విట్టర్, మెటా తర్వాత తాజాగా స్ట్రీమింగ్ దిగ్గజం డిస్నీ లేఆఫ్స్, నియామకల నిలిపివేత దిశగా పయనిస్తున్నట్టు వెల్లడైంది. ఆర్ధిక మందగమనం నేపధ్యంలో ఖర్చులను తగ్గించుకునే క్రమంలో మెటా ఏకంగా 11,000 మంది ఉద్యోగులను తొలగించగా, ట్విట్టర్ సగానికి పైగా సిబ్బందిని సాగనంపింది.
ఇక ఆదాయం పడిపోవడంతో డిస్నీ సైతం వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు కంపెనీ సీఈఓ బాబ్ చాపెక్ సంకేతాలు పంపారు. కంపెనీలో నూతన నియామకాలను నిలిపివేస్తున్నామని, ఇది మీ టీమ్స్‌కు ఎలా వర్తింపచేయాలనేది ఉన్నతాధికారులు, హెచ్ఆర్ బృందాలు నిర్ధారిస్తాయని ఆయా డివిజన్ హెడ్స్‌కు పంపిన మెమోలో డిస్నీ సీఈఓ బాబ్ చాపెక్ పేర్కొన్నారు.
ఈ సమీక్షలో భాగంగా కొద్దిమంది ఉద్యోగులనూ తొలగించాలని యోచిస్తున్నట్టు కూడా ఈ మెమోలో ఆయన బాంబు పేల్చారు. మొత్తం 1,90,000 మంది ఉద్యోగులు డిస్నీలో పనిచేస్తున్నారు. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా కంపెనీ ఉన్నతాధికారులు బిజినెస్ టూర్స్‌ను తగ్గించాలని కోరారు. అత్యవసర ట్రిప్‌లను మాత్రమే చేపట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశాలు సైతం వర్చువల్‌గా నిర్వహించాలని ఆయా విభాగాధిపతులకు సూచించారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- disney
- layoffs
- technology news
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

