Elon Musk-Twitter | ట్విట్టర్‌కు 1200 మంది ఉద్యోగులు గుడ్‌బై ?.. బ్లూ ప్రింట్ కోరిన మస్క్!
Elon Musk-Twitter | ట్విట్టర్ నుంచి 1200 మంది ఉద్యోగులు వైదొలిగినట్లు తెలుస్తున్నది. వారిని బ్లూ ప్రింట్ ఇవ్వాలని మస్క్ కోరారు.
Elon Musk-Twitter | సంస్థను లాభాల బాట పట్టించేందుకు కష్టపడి పని చేస్తారా.. ఇంటికెళ్లిపోతారా? అని ఎలన్‌మస్క్ జారీ చేసిన ఆల్టిమేటమ్ గడువు పూర్తవ్వడంతో దాదాపు 1200 మంది ట్విట్టర్ ఉద్యోగులు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లోని సాఫ్ట్వేర్ ఇంజినీర్లంతా శాన్ఫ్రాన్సిస్కోలోని సంస్థ ప్రధాన కార్యాలయానికి రావాలని వారికి ఎలన్‌మస్క్ ఈ-మెయిల్ పంపారు. భౌతికంగా బే-ఏరియాకు రాలేని వారు, కుటుంబ అత్యవసర పరిస్థితులు ఉన్న వారిని మినహాయిస్తున్నట్లు ఆ ఈ-మెయిల్లో పేర్కొన్నారు.
గత నెలాఖరులో ట్విట్టర్‌ను టేకోవర్ చేయగానే 7500 మంది సిబ్బందిలో సగం మందిని ఎలన్‌మస్క్ ఇంటికి పంపేశారు. మస్క్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలతో మరో 1200 మంది నిష్క్రమించడానికి రంగం సిద్ధమైంది.
గత ఆరు నెలలుగా ట్విట్టర్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు తయారు చేసిన కోడింగ్‌పై బ్లూ-ప్రింట్ సమ్మరీ అంద జేయాలని ఎలన్‌మస్క్ కోరినట్లు తెలుస్తున్నది. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఇచ్చే బ్లూ ప్రింట్ సమ్మరీతో ట్విట్టర్లో టెక్నాలజీ పనితీరును అర్థం చేసుకునేందుకు వీలవుతుందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. సామూహికంగా ఉద్యోగులు వైదొలుగుతారన్న సంకేతాల మధ్య ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల ట్విట్టర్ కార్యాలయాలు మూసేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత కొన్ని గంటలకు సిబ్బందికి ఎలన్‌మస్క్ మెయిల్ పంపడం గమనార్హం.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

