Daam Virus | ఆండ్రాయిడ్ యూజర్లను ముచ్చెమటలు పుట్టిస్తున్న దామ్ వైరస్.. దీని నుంచి ఎలా తప్పించుకోవాలి?
Daam Virus | ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు పొంచివున్న తాజా ముప్పు దామ్ వైరస్. అన్ని వైరస్లు కేవలం డేటాను మాత్రమే దొంగిలించడం కాదు.. మొబైల్లోని ఒరిజినల్ డేటాను కూడా డిలీట్ చేయడం దీని ప్రత్యేకత. అందుకే ఈ వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరికలు జారీ చేసింది.
Daam Virus | ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు పొంచివున్న తాజా ముప్పు దామ్ వైరస్. అన్ని వైరస్‌ల్లా ఇది కేవలం డేటాను మాత్రమే దొంగిలించడమే కాదు.. మొబైల్లోని ఒరిజినల్ డేటాను కూడా డిలీట్ చేయడం దీని ప్రత్యేకత. అందుకే ఈ వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరికలు జారీ చేసింది. యాంటీవైరస్‌ను కూడా మాయచేయగలిగిన ఈ మాల్వేర్తో అప్రమత్తంగా ఉండాలని ఇది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కూడా వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసలు దామ్ వైరస్ అంటే ఏంటి? అది మొబైల్‌లోకి ఎలా వస్తుంది? ఆ వైరస్ బారినపడొద్దంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
దామ్ వైరస్ అంటే ఏంటి?
దామ్ వైరస్ అనేది ఒక ర్యాన్సమ్వేర్. అనాథరైజ్డ్ వెబ్సైట్లను ఓపెన్ చేసినప్పుడు లేదా థర్డ్ పార్టీ యాప్స్‌ను ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు దామ్ వైరస్ మొబైల్‌లోకి చొరబడుతుంది. ఒక్కసారి ఫోన్లోకి రాగానే సెక్యూరిటీని బోల్తా కొట్టించి తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత డేటా మొత్తాన్ని తస్కరించి సైబర్ నేరగాళ్లకు చేరవేస్తుంది.
మొబైల్‌లోకి ప్రవేశించగా ర్యాన్సమ్వేర్ ఏం చేస్తుంది?
దామ్ వైరస్ మొబైల్‌లోకి ప్రవేశించగానే సెక్యూరిటీ చెక్‌ను తప్పించుకుంటుంది. ఆ తర్వాత దానికి అనుగుణంగా ర్యాన్సమ్వేర్లో మార్పులు చేసుకుంటుంది. అప్పుడు మొబైల్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. బ్రౌజింగ్ హిస్టరీ, బుక్‌మార్క్స్, గ్యాలరీలలోని డేటాను దొంగిలిస్తుంది. ఇది ఫోన్‌బుక్, కాల్ రికార్డింగ్, ఎస్ఎంఎస్లను కూడా హ్యాక్ చేసి అందులోని కీలక సమాచారాన్ని కొట్టేయగలదు. కెమెరాను కూడా యాక్సెస్ చేస్తుంది. పాస్ట్‌వర్డ్‌లను మార్చేస్తుంది. కీలక సమాచారాన్ని స్క్రీన్‌షాట్ తీసుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌ను నిలిపివేస్తుంది.
ఇది ఎలా పనిచేస్తుంది?
ఆన్లైన్ నుంచి ఏవైనా ఫైల్స్‌ను డౌన్లోడ్ చేసుకునే సామర్థ్యం దామ్ వైరస్‌కు కలదు. అలాగే ఫోన్లోని ముఖ్యమైన సమాచారాన్ని కూడా కావాల్సిన చోటుకు అప్లోడ్ చేయగలదు. కాబట్టి ఫోన్లో సేకరించిన డేటాను ఇది సైబర్ నేరగాళ్లకు పంపిస్తుంది. దొంగిలించిన సమాచారం మొత్తాన్ని కూడా .enc ఫార్మాట్లో ఎన్‌క్రిప్ట్ చేసుకుని సైబర్ నేరగాళ్లకు చేరవేస్తుంది. ఎన్‌క్రిప్ట్ చేసేందుకు ఈ దామ్ వైరస్ aes ( అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్ ) అనే అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఇది డేటాను కాపీ చేసుకోవడంతో పాటు మొబైల్లో ఉన్న ఒరిజినల్ డేటాను డిలీట్ చేస్తుంది. అలా డేటా డిలీట్ చేసి మనల్నే బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలని జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆదేశాలు జారీ చేసింది.
దామ్ వైరస్ నుంచి ఎలా రక్షణ పొందాలి?
☞ మాల్వేర్ బారిన పడకుండా ఉండాలంటే ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్స్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. అన్ఆథరైజ్డ్, థర్డ్ పార్టీ యాప్స్ జోలికి అస్సలు వెళ్లకూడదు.
☞ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకునే ముందు వాటి డీటైల్స్, రివ్యూలు కచ్చితంగా చదవాలి. అలాగే యాప్ దేనికి సంబంధించినదో ఆ పర్మిషన్స్ తప్ప మిగతా పర్మిషన్స్‌ను అడుగుతుంటే వాటిని రిస్ట్రిక్ట్ చేయాలి.
☞ ఎప్పటికప్పుడు యాప్స్‌ను అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి.
☞ అన్ట్రస్ట్డ్, అశ్లీల వెబ్సైట్లకు దూరంగా ఉండాలి. తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన మెసేజ్‌ల్లోని లింక్స్, అటాచ్మెంట్స్ అస్సలు ఓపెన్ చేయకూడదు.
☞ పూర్తి వెబ్సైట్ నేమ్ కాకుండా bit.ly, tinyurl వంటి షార్ట్ యూఆర్ఎల్తో వచ్చే లింక్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
☞ యాంటీవైరస్, యాంటీస్పైవేర్ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసుకోవాలి. సేఫ్ బ్రౌజింగ్ టూల్స్ వాడాలి. ఫైర్‌వాల్, ఫిల్టరింగ్ సర్వీస్‌లను ఎనేబుల్ చేసుకోవాలి.
Read More :
Best Smart Phones | రూ.10 వేల లోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..!
Whatsapp | వాట్సాప్‌లో ఇక మొబైల్ నంబర్లు కనిపించవు.. భారీ మార్పులు తీసుకొస్తున్న మెటా!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Daam
- Malware
- Ransomeware
- tech tips
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

