Google Alert | మీ మొబైల్లో ఈ స్క్రీన్ రికార్డింగ్ యాప్ ఉందా..? వెంటనే డిలీట్ చేయండి..! లేకుంటే డేంజరే..!
Google Alert | ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. దాంతో చాలా మంది తమకు ఇష్టం వచ్చిన యాప్స్‌ను డౌన్లోడ్ చేస్తున్నారు. అయితే, ఏదిపడితే ఆ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుంటే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అయితే, ఇలాంటి యాప్‌లను గూగుల్ ఎప్పటికప్పుడు ప్లే స్టోర్‌లో ప్రమాదకరమైన మాల్వేర్ యాప్‌లను గుర్తించి నిషేధిస్తూ ఉంటుంది.
Google Alert | ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. దాంతో చాలా మంది తమకు ఇష్టం వచ్చిన యాప్స్‌ను డౌన్లోడ్ చేస్తున్నారు. అయితే, ఏదిపడితే ఆ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుంటే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అయితే, ఇలాంటి యాప్‌లను గూగుల్ ఎప్పటికప్పుడు ప్లే స్టోర్‌లో ప్రమాదకరమైన మాల్వేర్ యాప్‌లను గుర్తించి నిషేధిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్క్రీన్ రికార్డింగ్ యాప్‌ను గుర్తించి.. ప్లే స్టోర్ నుంచి తొలగించింది. యాప్ మొబైల్లోని డేటాను రహస్యంగా దొంగిలిస్తున్నట్లు గుర్తించి.. ఈ మేరకు చర్యలు చేపట్టింది.
ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్న వారు వెంటనే డిలీట్ చేయాలని సూచించింది. అయితే, ఆండ్రాయిడ్ సైబర్ సెక్యూరిటీ కంపెనీలు యాప్ డిఫెన్స్ అలయన్స్ సంస్థలు ఐ రికార్డర్-స్క్రీన్ రికార్డర్ ( iRecorder- Screen Recorder) యాప్ ట్రోజన్స్ బారినపడ్డట్లు గూగుల్‌కు సమాచారం అందించాయి. ఈ క్రమంలో గూగుల్ తొలగించింది. ఈ యాప్ సహాయంతో యూజర్లు స్క్రీన్ రిక్డారింగ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను 2021లో డెలపర్లు గూగుల్ ప్లేస్టోర్‌లో అప్లోడ్ చేశారు. ఏడాది తర్వాత ప్రమాదకరమైన AhRat అనే వైరస్ సోకింది. ఈ క్రమంలో దాన్ని తొలగించింది. ఇప్పటి ఈ ఆండ్రాయిడ్ యాప్‌ను 50వేల కంటే ఎక్కువ మొబైల్స్‌లో ఇన్స్టాల్ చేసినట్లు తెలుస్తుంది.
ఈ యాప్ సహాయంతో లొకేషన్‌ను ట్రాక్ చేయడంతో పాటు ఆడియో, వీడియోలు, ఫొటోలను ఎక్కడి నుంచైనా ట్రాక్ చేయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే ఫోన్ మైక్‌ను ఉపయోగించి పరిసర ప్రాంతాల్లోని శబ్దాలను సైతం రికార్డ్ చేస్తుందని, వీడియోలు, ఆడియోలు, ఫొటోలు, వెబ్ పేజీలు, డాక్యుమెంట్లు, కంప్రెస్డ్ ఫైల్లు వంటి నిర్ధిష్ట ఎక్స్టెన్షన్లతో ఫైల్స్‌ను అనుమతి లేకుండానే అప్లోడ్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా iRecorder యాప్‌ను వినియోగిస్తే వెంటనే దాన్ని అన్ఇన్స్టాల్ చేయాలని సూచిస్తున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

