Code Llama VS ChatGPT | చాట్‌జీపీటీకి దీటుగా కోడ్ లామా లాంఛ్..మెటా ఏఐ టూల్‌తో ఎవరికి వరం.!
ఏఐ రేస్‌లో చాట్‌జీపీటీకి (Code Llama VS ChatGPT) దీటైన పోటీ ఇచ్చేందుకు మెటా సరికొత్త ఏఐ టూల్ కోడ్ లామాతో ముందుకొచ్చింది.
న్యూయార్క్ : ఏఐ రేస్‌లో చాట్‌జీపీటీకి (Code Llama VS ChatGPT) దీటైన పోటీ ఇచ్చేందుకు మెటా సరికొత్త ఏఐ టూల్ కోడ్ లామాతో ముందుకొచ్చింది. కోడర్లు, ఐటీ ఇంజనీర్లకు కోడింగ్, ప్రోగ్రామింగ్‌లో తోడ్పాటు ఇచ్చేలా ఏఐ టూల్ కోడ్ లామాను మెటా డెవలప్ చేసింది. ఓపెన్ఏఐ రూపొందించిన చాట్‌జీపీటీ టూల్ ప్రస్తుతం ప్రాజెక్టులు, కోడ్స్ రాయడంలో ప్రజలకు సాయపడుతుండగా ఈ టూల్‌కు కోడ్ లామా ప్రధాన పోటీదారుగా ముందుకొచ్చిందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
కోడ్ లామా ద్వారా యూజర్లు తమ వర్క్‌ను వేగంగా, మరింత సమర్ధంగా పూర్తిచేయవచ్చని మెటా పేర్కొంది. కోడ్ నేర్చుకునే వారికి ఎదురయ్యే అడ్డంకులను ఇది నిరోధిస్తుందని మెటా తెలిపింది. ప్రోగ్రామర్లు మరింత వేగంగా, సమర్ధవంతమైన సాఫ్ట్‌వేర్‌ను రాసేందుకు కోడ్ లామా ప్రోడక్టివిటీ, ఎడ్యుకేషనల్ టూల్‌గా సాయపడుతుందని కంపెనీ వెల్లడించింది. న్యూ సాఫ్ట్‌వేర్‌ను రాయడం నుంచి ప్రస్తుత కోడ్ డీబగ్గింగ్ వరకూ ప్రోగ్రామర్లు ఇప్పటికే ఎల్ఎల్ఎంలను వాడుతున్నారని మెటా బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొంది.
డెవలపర్ల పనిని మరింత సమర్ధంగా ఉండేలా ఈ టూల్ ఉపకరిస్తే వారు తమ పనుల్లో మానవ మేథను వాడే అంశాలపై మరింత దృష్టిసారించే వెసులుబాటు ఉంటుందనేదే తమ ధ్యేయమని మెటా వెల్లడించింది. బెంచ్‌మార్క్ టెస్టింగ్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ల్యాంగ్వేజ్ మోడల్స్ కంటే కోడ్ లామా మెరుగైన సామర్ధ్యం కనబరుస్తుందని కంపెనీ తెలిపింది. కోడ్ బెంచ్‌మార్క్ హ్యుమన్ఇవల్పై కోడ్ లామా 53.7 స్కోర్ సాధించిందని మెటా పేర్కొంది.
Read More :
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

